Ex IAS Officer : వివాదంలో మరో మాజీ ఐఏఎస్.. ఆ సర్టిఫికెట్‌తో సివిల్స్‌కు ఎంపికవడంపై రగడ
లోకోమోటర్ వైకల్యం ఉందని నమ్మించి ఆయన ఐఏఎస్ అయ్యాడు. కట్ చేస్తే.. ఐఏఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. జిమ్ చేస్తున్నారు.
- Author : Pasha
Date : 15-07-2024 - 1:59 IST
Published By : Hashtagu Telugu Desk
Ex IAS Officer :లోకోమోటర్ వైకల్యం ఉందని నమ్మించి ఆయన ఐఏఎస్ అయ్యాడు. కట్ చేస్తే.. ఐఏఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. జిమ్ చేస్తున్నారు. అన్ని శక్తులూ ఇప్పుడు ఆయనకు వచ్చేశాయి. ఈవివరాలు మాజీ ఐఏఎస్(Ex IAS Officer) అభిషేక్ సింగ్‌కు సంబంధించినవి. లోకోమోటర్ వైకల్యం ఉన్న వ్యక్తి ఇంత ఈజీగా ఎలా డ్యాన్స్ చేయగలుగు తున్నారు అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. అభిషేక్ కూడా యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఉద్యోగం సంపాదించి ఉంటారని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. లేనిపోని అభియోగాలను నాపై మోపుతున్నారు’’ అని అభిషేక్ సింగ్ అంటున్నారు. ఇప్పటివరకు తనపై ఎలాంటి విమర్శలు కూడా రాలేదని ఆయన చెబుతున్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ‘‘నేను ఐఏఎస్‌ను రిజర్వేషన్‌తో సంపాదించలేదు. దానికోసం బాగా కష్టపడ్డాను. కష్టకాలాన్ని ధైర్యంగా ఎదురీదాను. అందుకే ఆ స్థాయికి వెళ్లాను’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రభుత్వ సహాయం లేకుండానే తాను సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని నేను బలంగా నమ్ముతాను. అందుకే రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చాను’’ అని అభిషేక్ తెలిపారు. ‘‘నాలో ఉన్న ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఆధారంగానే ఐఏఎస్ జాబ్‌ను వదిలేశాను. సినిమా రంగంలో ఇప్పుడు నేను పనిచేస్తున్నాను’’ అని చెప్పారు. కాగా, 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అభిషేక్ సింగ్(Abhishek Singh) గత ఏడాది తన పదవికి రాజీనామా చేశారు. ఆయన యూపీఎస్సీ ఎంపికలో రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందేందుకు లోకోమోటర్ వైకల్యం ఉందని ఆధారాలు ఇచ్చారని సమాచారం.
Also Read :200 Animals Killed : అసోంలో వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్.. 200 జంతువులు బలి
సివిల్స్‌కు ఎంపికయ్యేందుకు యూపీఎస్సీకి ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై దర్యాప్తు కోసం కేంద్ర సర్కారు ఏకసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. దర్యాప్తులో ఆ ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే ఛాన్స్ ఉంది.