200 Animals Killed : అసోంలో వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్.. 200 జంతువులు బలి
ఈ ఏడాది మే నుంచి ముంచెత్తుతున్న వరదల కారణంగా రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లోని 10 ఖడ్గమృగాలు సహా మొత్తం 200 వన్యప్రాణులు చనిపోయాయి.
- By Pasha Published Date - 01:36 PM, Mon - 15 July 24

200 Animals Killed : అసోంను వరదలు వణికిస్తున్నాయి. ఈ ఏడాది మే నుంచి ముంచెత్తుతున్న వరదల కారణంగా రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లోని 10 ఖడ్గమృగాలు సహా మొత్తం 200 వన్యప్రాణులు చనిపోయాయి. ఇవాళ ఉదయం అధికారికంగా విడుదల చేసిన బులెటిన్‌లో ఈవివరాలను ప్రస్తావించారు. దీని ప్రకారం.. ఈ వర్షాకాలం సీజన్‌లో వరదల కారణంగా కజిరంగా నేషనల్ పార్కులోని 10 ఖడ్గమృగాలు, 179 హాగ్ డీర్, 3 చిత్తడి జింకలు సహా మొత్తం 198 జంతువులు(200 Animals Killed) మరణించాయి. 1,300 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్ పార్కులో 2600కుపైగా ఖడ్గమృగాలు, 135 పులులు ఉన్నాయి. వరదల నేపథ్యంలో కజిరంగా నేషనల్ పార్కు పక్కనున్న జాతీయ రహదారిని దాటే క్రమంలో ఇటీవల వేర్వేరు ఘటనల్లో రెండు జింకలు చనిపోయాయి.
We’re now on WhatsApp. Click to Join
109కి చేరిన మరణాలు
వరదల వల్ల ఆదివారం రాత్రి అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఒకరు, నిజాంబజార్ జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో ఈ వర్షాకలంలో చనిపోయిన వారి సంఖ్య 109కి పెరిగింది. అసోంలో వరదల కారణంగా గత రెండునెలల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా దాదాపు 6 లక్షల మంది ప్రభావితం అయ్యారు. కాచార్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రీ, దిబ్రూగఢ్, గోల్‌పరా, గోలాఘాట్, జోర్హాట్, కమ్రూప్, కమ్రూప్ మెట్రోపాలిటన్, కరీంగంజ్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బరీ, శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది.
Also Read :Food Deliveries : జొమాటో, స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఛార్జీలు పెంపు
ఒక్క జిల్లాలోనే 1.16 లక్షల మంది ప్రభావితం
దాదాపు 1.16 లక్షల మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితం అయ్యారని కాచర్ జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. ధుబ్రిలో దాదాపు 81 లక్షల మంది, నాగావ్‌లో 76 వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. వారి కోసం 13 జిల్లాల్లో 172 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రస్తుతం 58,816 మంది నిర్వాసితులు తలదాచుకుంటున్నారు. అసోంలోని 1,342 గ్రామాలు నీటమునిగాయి. 25 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది.