Adani Group Stocks: 15,000 కోట్లకు పెరిగిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.15,000 కోట్లకు పెరిగింది. మరోవైపు అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించింది.
- By Praveen Aluthuru Published Date - 04:00 PM, Sat - 25 November 23

Adani Group Stocks: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.15,000 కోట్లకు పెరిగింది. మరోవైపు అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్‌పై వేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. అదానీ వ్యవహారశైలిపై సెక్యురిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మీడియా నివేదికలను అనుసరించి నిర్ణయం తీసుకోలేమని ఆయన అన్నారు.కాగా స్టాక్ ధరలు పెరగడం అదానీ గ్రూప్‌పై ఇన్వెస్టర్ల విశ్వాసానికి నిదర్శనమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీ హిండెన్‌బర్గ్ వివాదాన్ని పక్కనపెట్టి పెట్టుబడి మరియు రాబడి విషయాలపై దృష్టి సారిస్తోందని అన్నారు.
Also Read: Iran Attack : ఇజ్రాయెల్ ఓడపై ఇరాన్ డ్రోన్ దాడి ?