Richa Apologizes: ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ పై నటి రిచా క్షమాపణ..!!
- By hashtagu Published Date - 05:59 AM, Fri - 25 November 22

భారతసైన్యం గురించి నటి చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. దీంతో బాలీవుడ్ నటి రిచా చద్దా క్షమాపణ చెప్పారు. రిచా ట్వీట్ ద్వారా భారత సైన్యాన్ని ఎగతాళి చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె చేసిన గాల్వాన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వెనక్కి తీసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్విదేది చేసిన ప్రకటనపై ప్రతిస్పందించారు. గ్వాలాన్ హాయ్ చెబుతోందంటూ రీచా ట్వీట్ చేశారు. రీచా చేసిన ఈ ట్వీట్ భారత సైన్యాన్ని అవహేళన చేసినట్లుగా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేశారు రీచా.