PM Modi : సింగపూర్‌లో ఘన స్వాగతం..ఢోలు వాయించిన ప్రధాని మోడీ
ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
- By Latha Suma Published Date - 04:14 PM, Wed - 4 September 24
Singapore Tour: భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు బ్రూనై పర్యటనను ముగించుకొన్న ప్రధాని సింగపూర్ వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోడీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోడీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోడీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని సింగపూర్ పర్యటనలో భాగంగా వాంగ్‌తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులను కలుసుకుంటారు. మోడీకి వాంగ్ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నారు. సింగపూర్‌లో అడుగుపెట్టగానే మోడీ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు మోడీ ఈ పర్యటన జరుపుతున్నారు. సుమారు ఆరేళ్ల తరువాత సింగపూర్‌లో మోడీ పర్యటిస్తున్నారు. భారత్-సింగపూర్ మధ్య స్నేహాన్ని విస్తృతం చేస్తూ వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
#WATCH | Prime Minister Narendra Modi tries his hands on a dhol. Members of the Indian diaspora welcomed PM Modi on his arrival in Singapore. pic.twitter.com/JBWG5Bnrzk
— ANI (@ANI) September 4, 2024
కాగా, ప్రధాని మోడీ బ్రూనై, సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి 40 ఏళ్లయిన సందర్భంగా మోడీ ఈ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని బ్రూనై వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్రూనై రాజు హాజీ హసనల్ బోల్కియాను మోడీ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: GOAT Release : ఉద్యోగులకు హాలిడే ఇచ్చిన కంపెనీ..!!
Related News
Mudra Loans: పీఎం ముద్రా యోజన.. వైరల్ అవుతున్న ఫేక్ లెటర్..!
పౌరులు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ప్రభుత్వం వారికి సహాయం చేస్తుంది. దీని కింద ప్రభుత్వం కొన్ని రుణాలను ఇస్తుంది. దాని ద్వారా మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.