GOAT Release : ఉద్యోగులకు హాలిడే ఇచ్చిన కంపెనీ..!!
విజయ్ సర్‌పై ఉన్న అభిమానానికి చిహ్నంగా అలాగే మా ఉద్యోగులలో ఉన్న అపారమైన ఉత్సాహానికి గుర్తుగా, యాజమాన్యం ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది
- By Sudheer Published Date - 04:01 PM, Wed - 4 September 24
తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఎవరంటే టక్కున విజయ్ (Vijay) పేరు చెపుతారు. విజయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పెద్ద పండగే. రిలీజ్ కు వారం ఉండగానే థియేటర్స్ ను ముస్తాబు చేయడం..భారీ కటౌట్స్ , ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం చేస్తారు. ఇక ఇప్పుడు అలాంటి పండగ వాతావరణమే తమిళనాట నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.
విజయ్ (Hero Vijay) నటించిన సైన్స్, ఫిక్షన్, యాక్షన్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAt). వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ మూవీ లో ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు నటించారు. రేపు ( సెప్టెంబర్ 5వ తేదీన ) వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ క్రమంలో రేపు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవును ప్రకటిస్తున్నాయి. తాజాగా పార్క్విక్ (ParkQwik ) అనే పార్కింగ్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు గోట్ రిలీజ్ సందర్బంగా సెలవు ప్రకటించింది.
విజయ్ సర్‌పై ఉన్న అభిమానానికి చిహ్నంగా అలాగే మా ఉద్యోగులలో ఉన్న అపారమైన ఉత్సాహానికి గుర్తుగా, యాజమాన్యం ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. సినిమా హిట్ కావాలని ది గోట్ చిత్ర బృందానికి మా విషెస్ తెలుపుతున్నాం. అలాగే ఈ సినిమాకు సంబంధించి మా ఉద్యోగులకు కాంప్లిమెంటరీ టిక్కెట్‌లను కూడా అందించబోతున్నాం అంటూ పార్క్విక్ సీఈఓ అరుణ్ కుమార్ ప్రకటన విడుదల చేశాడు. ఈ నిర్ణయం తో ఉద్యోగులే కాదు విజయ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ParkQwik declared Holiday for their employees 🔥
Happens only for Thalapathy 💥💥#TheGreatestOfAllTime #TheGOAT pic.twitter.com/y49JvIQ8Yz
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) September 3, 2024
Read Also : Wayanad: వయనాడ్‌లో పునరావాసలకు నెల వేతనం విరాళంగా ప్రకటించిన రాహుల్
Related News
Sundeep Kishan : విజయ్ తనయుడి దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా..?
తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో జాసన్ విజయ్ దర్శకత్వంలో సినిమాని కూడా ప్రకటించారు.