A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం
A Worker Vs MLA : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సాజా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వచ్చింది.
- Author : Pasha
Date : 04-12-2023 - 1:43 IST
Published By : Hashtagu Telugu Desk
A Worker Vs MLA : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సాజా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వచ్చింది. ఇక్కడి నుంచి ఓ సామాన్యుడు ఎన్నికల బరిలోకి దిగాడు. ఈశ్వర్ సాహు అనే రోజూ వారీ కూలీ పోటీ చేశాడు. ఇటీవలే ఈశ్వర్ కొడుకు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు సాహు కుమారుడిని మూకుమ్మడిగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఇంతకుముందు వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. తన కుమారుడి హత్య కేసు దోషులను కాపాడుతున్నారని ఈశ్వర్ సాహు ఆరోపిస్తున్నారు. బీజేపీ కూడా ఆయనకు నైతిక మద్దతు ప్రకటించింది. అంతటితో ఊరుకోకుండా ఈశ్వర్ సాహుకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి.. సాజా నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరఫున ఏడుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే పోటీ చేశారు. తీరా ఎన్నికల ఫలితం చూసి అందరూ షాక్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ఈశ్వర్ సాహుకు ఏకంగా 5,527 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించాడు. దీంతో అక్కడ బీజేపీ వ్యూహం ఫలించినట్లయింది.
We’re now on WhatsApp. Click to Join.
ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 54 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ 35 స్థానాల్లో గెలిచాయి. 2018 ఎన్నికల్లో 68 సీట్లతో హస్తం పార్టీ అధికారం చేపట్టగా.. బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. ఈసారి పూర్తిగా బీజేపీకి అనుకూల పవనాలు(A Worker Vs MLA) వీచాయి. కాంగ్రెస్ సర్కారులోని డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్, హోంమంత్రి తమ్రద్వాజ్ సాహూ కూడా ఓడిపోయారు.