Bull Fight: నోయిడాలోని బట్టల దుకాణంలో ఎద్దుల బీభత్సం
గ్రేటర్ నోయిడా దాద్రిలో రెండు ఎద్దులు భీభత్సం సృష్టించాయి. స్థానిక బట్టల దుకాణంలోకి చొరబడి నానా హంగామా చేశాయి. దీంతో కస్టమర్లు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
- Author : Praveen Aluthuru
Date : 12-04-2023 - 4:27 IST
Published By : Hashtagu Telugu Desk
Bull Fight: గ్రేటర్ నోయిడా దాద్రిలో రెండు ఎద్దులు భీభత్సం సృష్టించాయి. స్థానిక బట్టల దుకాణంలోకి చొరబడి నానా హంగామా చేశాయి. దీంతో కస్టమర్లు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఎద్దుల దాడిలో ఫర్నిచర్ ధ్వంసమైంది. సామాగ్రి చెల్లాచెదురైంది. చాలా కష్టం మీద వాటిని బయటకు పంపంచాల్సి వచ్చింది. వివరాలలోకి వెళితే…
గ్రేటర్ నోయిడాలోని దాద్రి పట్టణంలో ఎద్దుల బెడద ఎక్కువైంది. రోడ్లపై ప్రయాణించే వారు ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. తాజాగా రెండు ఎద్దులు పోట్లాటకు దిగాయి. ఇంకేముందు దాద్రిలో వీరంగం సృష్టించాయి. దాద్రిలో రెండు ఎద్దులు పోట్లాడుతూ స్థానిక బట్టల దుకాణంలోకి చొరబడ్డాయి. దాంతో దుకాణంలోని కస్టమర్లు ప్రాణ భయంతో పరుగులు తీశారు. షాపులో పోట్లాడుతూ యజమానులకు చుక్కలు చూపించాయి. చాలా కష్టం మీద వాటిని బయటకు పంపించేశారు. ఎద్దుల బీభత్సం కారణంగా షాపు యజమాని తీవ్రంగా నష్టపోయాడు. ఫర్నిచర్ ధ్వంసం అవ్వడమే కాకుండా దుకాణంలోని సామాగ్రి చెల్లాచెదురైంది.ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దాద్రి రోడ్లపై ఎద్దుల బెడద పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇంత జరిగినా అధికార, యంత్రాంగం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
UP: A buII entered a clothes shop in Dadri town of Greater Noida.
The customers ran away to save their lives.
Scene captured in CCTV. pic.twitter.com/HG04PcfuRT— زماں (@Delhiite_) April 11, 2023
Read More: Viral Video: పుచ్చకాయను దొంగలించిన ఏనుగు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!