HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >80 Years Old Man Standing The Line Of Ukrainian Army His Pic Is Going Viral

Ukraine Russia War: ర‌ష్యాతో యుద్ధానికి ఉక్రెయిన్ ఆర్మీ లైన్‌లో నిల్చున్న వృద్ధుడు..!

  • By HashtagU Desk Published Date - 04:28 PM, Sat - 26 February 22
  • daily-hunt
Ukrain Russia War
Ukrain Russia War

ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలెట్టిన రష్యా రోజురోజుకూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. ర‌ష్యా దాడుల కార‌ణంగా ఇప్ప‌టికే వంద‌ల‌మంది ఉక్రెయిన్ సైనికుల‌తో పాటు, అమాయ‌క పౌరులు కూడా మ‌ర‌ణించారు. వేల‌మంది గాయ‌ప‌డ్డారు. ఎంతో మంది ఉక్రెయిన్ ప్ర‌జ‌లు భ‌యంతో రోడ్ల మీద‌కు వ‌చ్చి, బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. తమ వారికి అండగా నిలవాలనే తలంపుతో ఉపాధి కోసం సైన్యంలోకి చేరుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు దేశం దాటి పోకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్‌స్కీ ఆదేశించడంతో ఎంతో మంది కుటుంబాలకు దూరంగా దేశంలోనే ఉండిపోయారు. దేశ అధ్యక్షుడు జెలన్‌ స్కీ కూడా సైనికుడిలా మారి తానే దగ్గరుండి సైన్యాన్ని నడిపించడం ప్రారంభించారు. ఇటీవలే ఓ తండ్రి, కూతుళ్ల వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఒకరిని విడిచి మరోకరు వదిలి వెళ్ల లేక కంట తడి పెట్టడం అందరినీ కదిలించించి.

ఇక దేశం కోసం పోరాడాలంటే యువకులే కాదు.. తాను కూడా సిద్ధమంటూ ముందుకొచ్చాడు ఉక్రెయిన్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరుణంలో ఆ పోరాటంలో తాను కూడా పాల్గొంటానంటూ ఆ వయోధికుడు సైన్యంలో చేరేందుకు రావడం హృదయాన్ని పిండేస్తోంది. ఉక్రెయిన్ ఆర్మీలో తాను కూడా చేరతానంటూ ఆ వృద్ధుడు యువకులతో పాటు క్యూ లైన్‌లో నిల్చున్నాడు. ఈ ఫొటోను క్రత్రేయనా అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.

ఆర్మీలో చేరేందుకు వ‌చ్చిన వృద్ధుడు అతనితో పాటు ఓ బ్యాగ్ కూడా తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్‌లో ఏమున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వృద్ధుడి బ్యాగ్‌లో 2 టీషర్ట్స్, ఓ జత ఫ్యాంట్లు, 2 టూత్ బ్రష్‌లు, లంచ్ కోసం కొన్ని శాండ్‌విచ్‌లు ఉన్నాయి. తన మనవల కోసం ఈ పనికొచ్చానని అతను చెప్పాడు. 80 ఏళ్ల వృద్ధుడు ఇలా సైన్యంలో చేరేందుకు రావడం నెటిజన్ల హృదయాన్ని కదిలిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియ‌ల్లో ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది.

Someone posted a photo of this 80-year-old who showed up to join the army, carrying with him a small case with 2 t-shirts, a pair of extra pants, a toothbrush and a few sandwiches for lunch. He said he was doing it for his grandkids. pic.twitter.com/bemD24h6Ae

— Kateryna Yushchenko 🌻 🇺🇦 (@KatyaYushchenko) February 24, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 80 years old man
  • Russai
  • Russia-Ukraine War
  • ukraine
  • Ukrainian army
  • Ukrainian citizens

Related News

Zelensky

Trump Tariffs : భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు సమంజసం: జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

యుద్ధాన్ని నడిపిస్తున్న రష్యా నుంచి చమురు వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాలు, అర్థపూర్వకంగా ఆ యుద్ధానికి వాణిజ్యంగా సహకరిస్తున్నట్టేనని. అలాంటి దేశాలపై పన్నులు, టారిఫ్‌లు విధించడం అన్యాయంగా కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Russia

    Russia : ఉక్రెయిన్ మంత్రులే లక్ష్యంగా రష్యా డ్రోన్, క్షిపణుల దాడి

Latest News

  • KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

  • Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్

  • Vice President : దేశంలోనే అత్యున్నత పదవి.. స్థానం రెండోది అయినా జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  • Nandamuri Balakrishna : నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది హీరో బాలకృష్ణ

  • Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd