Explosion At Cold Storage: కోల్డ్ స్టోరేజీలో పేలుడు.. ఐదుగురు మృతి
కోల్డ్ స్టోరేజీలో పేలుడు (Explosion At Cold Storage) జరిగి ఐదుగురు కార్మికులు మరణించిన సంఘటన యూపీలోని మీరట్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో పేలుడు జరగడంతో కోల్డ్ స్టోరేజీ పైకప్పు, గోడలు కూలి పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
- Author : Gopichand
Date : 25-02-2023 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
కోల్డ్ స్టోరేజీలో పేలుడు (Explosion At Cold Storage) జరిగి ఐదుగురు కార్మికులు మరణించిన సంఘటన యూపీలోని మీరట్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో పేలుడు జరగడంతో కోల్డ్ స్టోరేజీ పైకప్పు, గోడలు కూలి పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పేలుడు శబ్ధం విన్న స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
మీరట్ జిల్లా దౌరాలా ప్రాంతంలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే చంద్రవీర్ సింగ్ కోల్డ్ స్టోరేజీలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగింది. కోల్డ్ స్టోరేజీలోని బాయిలర్ పేలిందని, దీంతో గ్యాస్ లీక్ అయి పైకప్పు మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. అందిన సమాచారం ప్రకారం.. ఐదుగురు కార్మికులు మరణించగా, 50-60 మంది కార్మికులు గాయపడ్డారు. అయితే, అధికారిక మరణాల సంఖ్య ఇంకా ధృవీకరించబడలేదు. కొంతమంది కూలీలు శిథిలాల కింద ఇరుక్కుపోయారని, లీకేజీ కారణంగా కొందరు స్పృహ తప్పి పడిపోయారని, వారిని మీరట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Bankruptcy: దివాళా అంచున పాకిస్తాన్.. లగ్జరీ కార్ల వేలానికి సిద్ధం!
బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే చంద్రవీర్ సింగ్ దౌరాలాలో శివశక్తి పేరిట కోల్డ్ స్టోరేజీ ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్డ్‌స్టోర్‌లోని బాయిలర్ పేలింది. దీంతో కోల్డ్ స్టోర్ మొత్తం అమ్మోనియా గ్యాస్ లీకైంది. గ్యాస్ లీకేజీ కారణంగా కొందరు కార్మికులు గాయపడ్డారు. ఇంతలో కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూడా ఎగిరిపోయి, అందులో కూలీలు శిథిలాల కింద సమాధి అయ్యారు. అదే సమయంలో ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అలాగే స్పృహ తప్పి పడిపోయిన కూలీలను ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
కూలీలందరూ జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారని, వారు నిన్ననే పనికి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం పోలీసు యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న డీఎం, ఎస్‌ఎస్పీ, ఏడీఎం సిటీ మెజిస్ట్రేట్, ఎస్‌డీఎం, సీఎంఓ, ఎస్పీ సిటీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కమిషనర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరితో పాటు కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్, మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.