Covid 19: వామ్మో కరోనా.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కేసులు!
ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
- Author : Balu J
Date : 09-03-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
వాతావరణ మార్పుల ప్రభావమో, లేక ఇతర కారణాలో తెలియదు ఇండియాలో మళ్లీ కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు (Corona Cases) పెరుగుతుండటంలో మరింత ఆందోళన కలిగిస్తోంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Central Health Department) ప్రకారం.. భారతదేశంలో 379 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,177 కు పెరిగాయి. ఇక మరణాల సంఖ్య 5,30,776గా ఉంది. మహారాష్ట్రలో ఒక మరణం నమోదైంది. కోవిడ్ కేసుల సంఖ్య (Corona Cases) 4.46 కోట్లు (4,46,89,072) నమోదైంది. COVID-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. ఇక వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.64 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు సరఫరా అయ్యాయి.
ఈ పరిణామాల మధ్య తాజాగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. చిన్న పిల్లలు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చిన్న పిల్లలు మాస్కులను (Masks) ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.
Also Read: Revanth Reddy@72: కాంగ్రెస్ కు 72 సీట్లు ఖాయం.. రేవంత్ రెడ్డి ధీమా!