HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >1984 Anti Sikh Riots Ex Congress Mp Sajjan Kumar Sentenced To Life Imprisonment

1984 Anti Sikh Riots: కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్‌కు జీవితఖైదు.. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సంచలన తీర్పు

ఈ హత్య జరిగిన మరుసటి రోజే (1984 నవంబరు 1న) దేశ రాజధాని ఢిల్లీలో సిక్కులపై(1984 Anti Sikh Riots) దాడులు జరిగాయి.

  • By Pasha Published Date - 03:13 PM, Tue - 25 February 25
  • daily-hunt
1984 Anti Sikh Riots Ex Congress Mp Sajjan Kumar Life Term Imprisonment Delhi Court

1984 Anti Sikh Riots: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య 1984 అక్టోబరు 31న జరిగింది. ఈ హత్య జరిగిన మరుసటి రోజే (1984 నవంబరు 1న) దేశ రాజధాని ఢిల్లీలో సిక్కులపై(1984 Anti Sikh Riots) దాడులు జరిగాయి. ఎంతోమంది సిక్కులను అల్లరి మూకలు హత్య చేశారు. ఆ రోజున ఢిల్లీలోని ఒక ఏరియాలో జస్వంత్ సింగ్ అనే వ్యక్తితో పాటు అతడి కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ మర్డర్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రమేయం ఉందని ఢిల్లీలోని ఓ కోర్టు విచారణలో తేలింది. దీంతో ఈనెల (ఫిబ్రవరి) 12వ తేదీనే ఆయనను దోషిగా తేల్చగా.. ఈరోజు శిక్షను ఖరారు చేశారు. సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు  స్పెషల్ జడ్జి కావేరీ బవేజా తీర్పును వెలువరించారు.

Also Read :Supreme Court: జోగి రమేష్, దేవినేని అవినాష్‌ దేశం విడిచి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు

2021 డిసెంబరు 16న అభియోగాలు నమోదు

సజ్జన్ కుమార్ వల్ల హత్యకు గురైన జస్వంత్ భార్య తరఫు న్యాయవాది ఢిల్లీ కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. సజ్జన్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయడం గమనార్హం. 1984 నవంబరు 1న జస్వంత్, తరుణ్‌ల మర్డర్ జరగగా.. 2021 డిసెంబరు 16న సజ్జన్ కుమార్‌పై కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ‘‘1984 నవంబరు 1న జస్వంత్ ఇంటిపై పెద్దసంఖ్యలో అల్లరిమూకలు దాడి చేశారు. ఆ గుంపునకు సజ్జన్ కుమార్ సారథ్యం వహించారు. జస్వంత్ ఇంట్లోని వారిపై దాడి చేసేలా అల్లరి మూకలను సజ్జన్ రెచ్చగొట్టారు’’ అని వాటిలో పేర్కొన్నారు.ఈ కేసులో జస్వంత్ భార్య ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ న్యాయపోరాటాన్ని కొనసాగించారు.

తిహార్ జైలులోనే సజ్జన్ 

  • కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.
  • 1984 నవంబరు 1, 2 తేదీల్లో ఢిల్లీలోని పాలం కాలనీలో జరిగిన ఐదుగురు సిక్కుల హత్యల కేసులో సజ్జన్ కుమార్ కొన్నేళ్ల క్రితమే దోషిగా తేలారు.  దీంతో ఆయనకు ఢిల్లీ హైకోర్టు అప్పట్లో జీవిత ఖైదు శిక్షను విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది ప్రస్తుతం పెండింగ్‌ దశలో ఉంది.
  • సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో ప్రభావవంతమైన నేతగా సజ్జన్ వ్యవహరించేవారు.

Also Read :Preity Zinta Loan : ‘‘ప్రీతీ జింతాకు రుణమాఫీ’’.. కాంగ్రెస్ ఆరోపణ.. హీరోయిన్ రియాక్షన్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1984 Anti Sikh Riots
  • congress
  • delhi court
  • Ex Congress MP
  • Life Term Imprisonment To Sajjan Kumar
  • Sajjan Kumar

Related News

CM Revanth Reddy

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd