Rs 1760 Crores Seize : ఐదు రాష్ట్రాల్లో ప్రలోభాల సునామీ.. రూ.1760 కోట్ల సొత్తు సీజ్
Rs 1760 Crores Seize : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం కీలక వివరాలను ప్రకటించింది.
- By pasha Published Date - 04:43 PM, Mon - 20 November 23

Rs 1760 Crores Seize : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం కీలక వివరాలను ప్రకటించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా మద్యం, నగదును అస్త్రాలుగా వాడుతున్న విషయాన్ని అద్దంపట్టే గణాంకాలను సాక్షాత్తూ ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసెంబ్లీ పోల్స్ జరుగుతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ. 1,760 కోట్లకుపైగా విలువ చేసే నగదు, మద్యం, వస్తువులు, మెటల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని ఈసీ వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇవే రాష్ట్రాల్లో 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్‌లో స్వాధీనం చేసుకున్న దాని కంటే.. ఈ మొత్తం దాదాపు 7 రెట్లు ఎక్కువని తెలిపింది. 2018లో ఇవే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం రూ. 239.15 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది. ఈసారి ఒక్క తెలంగాణలో రూ. 659.2 కోట్లను, రాజస్థాన్‌లో రూ. 650.7 కోట్లను, మధ్యప్రదేశ్‌లో రూ. 323.7 కోట్లను, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 76.9 కోట్లను, మిజోరంలో రూ. 49.6 కోట్లను సీజ్ చేశారు.
Also Read: Srikanth: దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం
రాష్ట్రం | నగదు (రూ. కోట్లు) | మద్యం (రూ. కోట్లు) | డ్రగ్స్ (రూ. కోట్లు) | విలువైన లోహాలు (రూ. కోట్లు) | ఉచితాలు, ఇతర వస్తువులు (రూ. కోట్లు) | మొత్తం (రూ. కోట్లు) |
ఛత్తీస్‌గఢ్ | 20.77 | 2.16 | 4.55 | 22.76 | 26.68 | 76.9 |
మధ్యప్రదేశ్ | 33.72 | 69.85 | 15.53 | 84.1 | 120.53 | 323.7 |
మిజోరం | 0 | 4.67 | 29.82 | 0 | 15.16 | 49.6 |
రాజస్థాన్ | 93.17 | 51.29 | 91.71 | 73.36 | 341.24 | 650.7 |
తెలంగాణ | 225.23 | 86.82 | 103.74 | 191.02 | 52.41 | 659.2 |
మొత్తం (రూ. కోట్లు) | 372.9 | 214.8 | 245.3 | 371.2 | 556.02 | ~ 1760 |
Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాన్ కు తీవ్ర గాయాలు
ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు విధ్వంసానికి దారి తీశాయి. ఐదు రాష్ట్రాలకు జరుపనున్న ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగానే మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు.