HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >150 Women Sarpanches For Independence Day Celebrations

Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు..150 మంది మహిళా సర్పంచ్‌లు..!

150 మంది మహిళా సర్పంచ్‌లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది..

  • Author : Latha Suma Date : 12-08-2024 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
150 women sarpanches for Independence Day celebrations..!
150 women sarpanches for Independence Day celebrations..!

Delhi: ఈ సారి ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్‌లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా సంస్థ ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఇప్పటికే వారికి ఆహ్వానం అందింది. ఈ మహిళా సర్పంచ్‌లందరూ ‘ప్రధానమంత్రి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ అవార్డు’ జాబితాలో ఎంపిక చేయబడ్డారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపిక చేయబడిన ఈ సర్పంచ్‌లు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అసాధారణమైన పనితీరు కనబరిచారని ఓ అధికారి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ విషయం గురించి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ,..”150 మంది మహిళా సర్పంచ్‌లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పంచాయతీ స్థాయిలో రాజకీయ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి, గుర్తించడానికి ప్రభుత్వ నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు, పరిపాలనలో మహిళలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. మహిళా శక్తిని ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రచారానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది.” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవలి 50కి పైగా గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికల ఓటమి నేపథ్యంలో.. మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మహిళలను ఆహ్వానించడం ద్వారా, పరిపాలన అట్టడుగు నాయకత్వానికి, నారీ శక్తి అభియాన్ పట్ల బీజేపీ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. ఈ ప్రయత్నం నారీమణులను గుర్తించడమే కాకుండా.. మహిళలకు సాధికారత కల్పించడం, గ్రామీణ పాలనను పెంపొందించడాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం యత్నిస్తోంది.

Read Also: Tata Curvv EV : టాటా కర్వ్‌ ఈవీ కోసం బుకింగ్ షురూ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Independence Day celebrations
  • pm modi
  • women sarpanches

Related News

    Latest News

    • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd