HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄India News
  • ⁄120 Member Egypt Contingent To Participate In Republic Day Parade President Abdel Fattah Al Sisi To Be Chief Guest

Republic Day Chief Guest: గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్-సిసి (President Abdel Fattah Al Sisi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఆయన జనవరి 24న ఢిల్లీకి వస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తాహ్‌ ఎల్‌-సిసి హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

  • By Gopichand Published Date - 01:46 PM, Sat - 21 January 23
Republic Day Chief Guest: గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్-సిసి (President Abdel Fattah Al Sisi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఆయన జనవరి 24న ఢిల్లీకి వస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తాహ్‌ ఎల్‌-సిసి హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈజిప్ట్‌ నుంచి ఒక నేత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు జనవరి 24న ఈజిప్ట్‌ అధ్యక్షుడు ఢిల్లీ చేరుకుంటారు. 25వ తేదీన ప్రధాని మోదీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సిసితో పాటు ఈజిప్ట్ నుండి 120 మంది సభ్యులతో కూడిన బృందం కూడా పాల్గొంటుంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి.

Also Read: UK PM Rishi Sunak fined: యూకే ప్ర‌ధాని రిషి సున‌క్ కు జ‌రిమానా

గత సంవత్సరం రాజ్‌పథ్ పేరును ‘కర్తవ్య మార్గం’గా మార్చిన తర్వాత సెరిమోనియల్ బౌలేవార్డ్‌లో నిర్వహించబడుతున్న మొదటి గణతంత్ర దినోత్సవ వేడుక ఇదే. దాదాపు 42,000 మంది హాజరవుతారని అంచనా. “మన గణతంత్ర దినోత్సవానికి ప్రెసిడెంట్ సిసిని ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ప్రెసిడెంట్ సిసి ఆహ్వానాన్ని సాదరంగా అంగీకరించారు. ఈ సంవత్సరం G20 ప్రెసిడెన్సీ సమయంలో ఈజిప్ట్‌ను అతిథి దేశంగా ఆహ్వానించాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఔసఫ్ సయీద్ తెలిపారు.

74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 19 దేశాల నుంచి 32 మంది అధికారులు, 166 మంది క్యాడెట్‌లు పాల్గొననున్నారు. ఈ ఏడాది ప్రజల కోసం ప్రభుత్వం 32,000 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మొదటి సారి వేడుక ఈవెంట్ కోసం అన్ని అధికారిక ఆహ్వానాలు కూడా ఆన్‌లైన్‌లో పంపబడుతున్నాయి. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు ప్రారంభమై మహాత్మా గాంధీ వర్ధంతి (జనవరి 30) వరకు కొనసాగుతాయి.

Telegram Channel

Tags  

  • January 26
  • pm modi
  • President Abdel Fattah Al Sisi
  • republic day
  • Republic Day Chief Guest

Related News

Election Survey : మ‌ళ్లీ భార‌త్ బాద్ షా మోడీ, ఇండియా టుడే-సీ వోట‌ర్ స‌ర్వే

Election Survey : మ‌ళ్లీ భార‌త్ బాద్ షా మోడీ, ఇండియా టుడే-సీ వోట‌ర్ స‌ర్వే

ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంది? అనే ప్ర‌శ్న‌ల‌కు

  • CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!

    CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!

  • Pakistan Flag: ఇంటి మీద పాక్ జెండా.. గణతంత్ర దినోత్సవం రోజు షాకింగ్ ఘటన!

    Pakistan Flag: ఇంటి మీద పాక్ జెండా.. గణతంత్ర దినోత్సవం రోజు షాకింగ్ ఘటన!

  • PM Modi Greets: ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఐక్యంగా ముందుకు సాగాలని ట్వీట్..!

    PM Modi Greets: ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఐక్యంగా ముందుకు సాగాలని ట్వీట్..!

  • Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!

    Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!

Latest News

  • Murder : ఢిల్లీలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌.. వివాహేత సంబంధ‌మే కార‌ణ‌మా..?

  • Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్‌.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: