SSB Jobs : 111 ఎస్‌ఐ జాబ్స్.. డిగ్రీ, ఇంటర్, నర్సింగ్ డిప్లొమాతో ఛాన్స్
SSB Jobs : సశస్త్ర సీమాబల్‌లో మొత్తం 111 జాబ్స్ భర్తీ అవుతున్నాయి.
- Author : Pasha
Date : 24-10-2023 - 4:49 IST
Published By : Hashtagu Telugu Desk
SSB Jobs : సశస్త్ర సీమాబల్‌లో మొత్తం 111 జాబ్స్ భర్తీ అవుతున్నాయి. డిగ్రీ, ఇంటర్, నర్సింగ్ డిప్లొమా అర్హతలు కలిగిన వారిని నాలుగు విభాగాల పోస్టులలో రిక్రూట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్‌లో అత్యధికంగా 59 ఎస్‌ఐ (కమ్యూనికేషన్), 29 పోస్టులు ఎస్‌ఐ (స్టాఫ్ నర్సు ఫిమేల్) విభాగాలకు చెందినవి ఉన్నాయి. వీటితో పాటు ఎస్‌ఐ(పయోనీర్) విభాగంలో 20, ఎస్‌ఐ (డ్రాఫ్ట్స్ మ్యాన్) విభాగంలో 03 ఉద్యోగాలను (SSB Jobs) భర్తీ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో అప్లికేషన్లను సమర్పించవచ్చు. అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ జాబ్స్‌ను ఎంపికయ్యే వారు దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి రెడీగా ఉండాలి. వీటికి అప్లై చేసే వారి వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. పురుషుల హైట్ 170 సెం.మీ, గాల్చిపీల్చినప్పుడు ఛాతీ 80 సెం.మీ ఉండాలి. ఇక మహిళల ఎత్తు 157 సెం.మీ ఉండాలి. ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికయ్యే వారికి పే స్కేలు రూ.35,400 – రూ.1,12,400 దాకా ఇస్తారు.