HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >11 Years Of Modi Rule Is Like A Golden Age Amit Shah

Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా

మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.

  • Author : Latha Suma Date : 09-06-2025 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah
Amit Shah

Amit Shah : ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టి సోమవారానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు. ఇది కేవలం పరిపాలన కాదని, ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే ప్రయాణమని పేర్కొన్నారు. ఆర్థిక పునరుద్ధరణ నుంచి జాతీయ భద్రత వరకు ప్రతీ అంశంలో భారత్ తన స్థాయిని మెరుగుపరచుకుంటోంది. దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్తున్న ఈ యాత్ర మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైంది అని అమిత్ షా పేర్కొన్నారు.

Read Also: Bhatti Vikramarka : మహిళల ఉచిత ప్రయాణానికి రూ.182 కోట్లు జీరో టికెట్లు: భట్టి విక్రమార్క

మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014లో కేంద్రంలో విధానపరమైన సంక్షోభం కొనసాగుతుందన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, నిరుద్యోగం, కుంభకోణాలు, పరిపాలన లోపాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని గుర్తుచేశారు. అలాంటి స్థితిలో బాధ్యతలు చేపట్టిన మోదీ, స్థిరమైన పాలనతో దేశాన్ని గాడిలో పెట్టారని వివరించారు. గత 11 ఏళ్లలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాల కోసం అనేక విధానాలు అమలు చేసినందునే దేశ అభివృద్ధి సమగ్రంగా సాగుతోందని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలకు బదులుగా, సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ అనే ధ్యేయంతో దేశం ముందుకు సాగుతోంది. ఇది వాగ్దానం కాదని, కార్యాచరణగా మారింది అన్నారు.

జాతీయ భద్రతలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి దేశాన్ని రక్షణ పరంగా బలోపేతం చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. నక్సలిజం ప్రస్తుతం ముగింపు దశలో ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా గట్టి సందేశం ఇచ్చిందని తెలిపారు. చివరిగా, బలమైన నాయకత్వం, దీర్ఘకాలిక దృక్పథం, ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధత ఉంటేనే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలమని మోదీ సర్కారు తేటతెల్లం చేసిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Read Also: RCB : బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 11 years of Modi rule
  • amit shah
  • golden period
  • modi govt
  • Operation Sindoor
  • pm modi

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd