HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Worst Dry Fruits To Eat For Diabetics

Dry Fruits: డయాబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

షుగర్ వ్యాధి గ్రస్తులు డ్రై ఫ్రూట్స్ తిన్నావచ్చా, తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 04-05-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dry Fruits
Dry Fruits

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. డ్రై ఫ్రూట్స్ ని కొన్ని నేరుగా తింటే మరికొన్నింటిని నీటిలో నానబెట్టి తినాలని చెబుతున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అన్నప్పటికీ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని డయాబెటిస్ ఉన్నవారు అసలు తినకూడదు అని చెబుతున్నారు. మరి డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి డ్రైఫ్రూట్స్ ని తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డయాబెటిక్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తినకపోవడమే మంచిదట. రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఫాస్ట్ గా పెంచుతాయట. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్ల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుందట. డయాబెటీస్ ఉన్నవారు మర్చిపోయి కూడా ఎండుద్రాక్షను అసలు తినకూడదట. ఎండుద్రాక్షలో చాలా పోషకాలు ఉంటాయట. కానీ వీటిలో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయట. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఎండు ద్రాక్షలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు సహజ చక్కెరల కోసం ఖర్జూరాలను ఎక్కువగా తింటుంటారు. ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. వీటిని తింటే మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మత్తుగా పెరుగుతుందట. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్లు ఖర్జూరాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అంజీర పండ్లలో నేచురల్ షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా తొందరగా పెంచుతాయట. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అంజీర పండ్లను తినకూడదని చెబుతున్నారు. డ్రై క్రాన్బెర్రీలు ఆడవాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. అలాగే ఈ పండ్లు మూత్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి బాగా సహాయపడతాయని, కానీ ఈ పండ్లను ఎక్కువగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • Dry Fruits
  • eating dry fruits
  • health tips

Related News

Huge relief for the common man... Government fixes prices of 39 medicines.

Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

దేశంలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే 39 అత్యవసర ఔషధాల చిల్లర ధరలను అధికారికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, బ్య

    Latest News

    • kavitha: ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ

    • CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd