పీరియడ్స్ నొప్పిని ఖతం చేసే నాలుగు రకాల పానీయాలు.. ఎలా తాగాలో తెలుసా?
పీరియడ్స్ సమయంలో నొప్పిని భరించలేక ఇబ్బంది పడుతున్న స్త్రీలు ఇప్పుడు చెప్పబోయే నాలుగు రకాల పానీయాలు తీసుకుంటే ఆ నొప్పి నుంచి ఈజీగా త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 17-12-2025 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
- పీరియడ్స్ పెయిన్ తగ్గించే పానీయాలు
ఈ నాలుగు పానీయాలతో నెలసరి నొప్పి మాయం
పీరియడ్స్ నొప్పిని ఖతం చేసే డ్రింక్స్
Period Pain: స్త్రీలకు ప్రతినెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే నెలసరి సమయంలో కొంతమందికి కడుపునొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కడుపునొప్పి సమస్యతో విలవిలలాడిపోతూ ఉంటారు. అయితే ఋతుస్రావం అనేది అందరు స్త్రీలకు ఒక సాధారణ చక్రం అయినప్పటికీ, ప్రతి స్త్రీ దానిని ఎదుర్కొనే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. కొంతమందికి తక్కువ నొప్పి ఉంటుంది లేదా దానిని నియంత్రించవచ్చు. కొంతమంది ఆ నొప్పిని అస్సలు భరించలేరు. మరికొందరికి కడుపులోనే కాకుండా, వీపు, చేతులు, కాళ్ళు, తుంటి, ఛాతీలో కూడా చాలా సమస్యలు ఉంటాయి.
ఇలా పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు రకాల పానీయాలు తీసుకుంటే ఆ నొప్పిని ఖతం చేయవచ్చని చెబుతున్నారు. కాగా స్త్రీలు నెలసరి సమయంలో రోజూ కొంత అల్లం తీసుకోవడం మంచిదట. మీరు రోజుకు రెండుసార్లు అల్లం టీ కూడా తీసుకోవచ్చు. అల్లంలోని జింజెరాల్ అణువుకు వైద్యం చేసే గుణాలు ఉన్నాయి. టీగా తీసుకున్నప్పుడు ఇది గర్భాశయ కండరాలను సడలించి, కడుపు నొప్పిని తగ్గిస్తుందని చెబుతున్నారు. మన ఆహారంలో దాల్చిన చెక్కను మసాలాగా మాత్రమే ఉపయోగిస్తాము. కానీ దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
దాల్చిన చెక్క ముఖ్యంగా నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందట. స్త్రీలు ఋతుస్రావం సమయంలో దాల్చిన చెక్కను నిప్పులాగా తీసుకుంటే, అది అధిక రక్తస్రావాన్ని నియంత్రించడంలో, కడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అందరు స్త్రీలలో ఋతుస్రావం ఒకేలా ఉండదు. కొంతమందికి ఇది సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. కానీ మరికొందరికి అధిక రక్తస్రావం సమస్య ఉంటుంది. మూడు నుండి ఐదు రోజుల వరకు ఉండే సాధారణ ఋతుస్రావాన్ని సాధారణమైనదిగా భావిస్తారు. కానీ కొంతమందికి ఇది పది రోజుల వరకు ఉంటుంది. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. మెంతి నీరు ఈ హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి ఋతుస్రావం, దాని మొత్తాన్ని నియంత్రించడానికి సహాయపడుతుందట.
మొదటి రాత్రి మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం త్రాగడం వల్ల మంచి మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే పసుపు పాలు కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడతాయట. జలుబు, ఫ్లూ లేదా దగ్గు వచ్చినప్పుడు మాత్రమే పసుపు పాలు తాగుతూ ఉంటారు. కానీ మీరు ఈ పసుపు పాలను రోజూ తాగితే, మీరు అనేక ఆరోగ్య మార్పులను చూడవచ్చట. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో చాలా మంచి మార్పులు వస్తాయని, ముఖ్యంగా మంచి నిద్రను వస్తుందట. మహిళలు ఋతుస్రావం సమయంలో ఈ పసుపు పాలు తాగినప్పుడు, రాత్రి నొప్పి అదుపులోకి వస్తుందని ఇది రక్త ప్రవాహాన్ని పెంచి ఋతుక్రమ నొప్పిని తగ్గిస్తుందని చెబుతున్నారు.