Periods: స్త్రీలు పీరియడ్స్ సమయంలో నొప్పి తట్టుకోలేక పోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?
- Author : Anshu
Date : 01-07-2024 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా స్త్రీలకు ప్రతి నెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే ఈ సమయంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. చాలా మందిలో స్కిన్ కేర్ సమస్యలు కూడా వస్తుంటాయి. మరి ముఖ్యంగా ఈ పీరియడ్స్ సమయంలో స్త్రీలు కడుపు నొప్పితో విలవిల్లాడుతూ ఉంటారు. ఆ నొప్పి వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అయితే నెలసరి వచ్చిన ప్రతిసారి రెండు మూడు రోజుల పాటు ఈ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. కొంతమంది మెడిసిన్స్ ని ఉపయోగించినప్పటికీ అవి తాత్కాలికంగానే పనిచేస్తూ ఉంటాయి.
ఇంకొందరు మెడిసిన్స్ ని ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు.. మరి అలాంటప్పుడు ఈ పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవాలో,అందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పీరియడ్స్ సమస్యతో స్త్రీలు ఉక్కిరిబిక్కిరై పోతుంటారు. నెలసరి సమయంలో తలెత్తే పొత్తు కడుపు నొప్పి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. నెలసరి సమయంలో మహిళలు పలు శారీరక సమస్యలకు గురవుతుంటారు. అందులో ప్రధానంగా పొట్ట నొప్పి, వీపు నొప్పి, తలనొప్పి, కాళ్ల నొప్పులు వంటివి ఉంటాయి. ఇక శక్తి స్థాయిలు తగ్గడం, అలసట నీరసం వంటివి కూడా వస్తాయి.
కొంతమంది మహిళలైతే పీరియడ్స్ సమయంలో వాంతులు చేసుకుంటారు. ఈ సమయంలో మైగ్రేన్ సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్న విషయానికొస్తే.. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ అల్లం, అర స్పూన్ పసుపు వేయాలి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత అర స్పూన్ నిమ్మరసం, తేనే వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన ఈ ద్రవాన్ని త్రాగాలి. ఇలా చేస్తే ఎలాంటి కడుపునొప్పి ఉండదు సరికదా రక్తస్రావం కూడా కంట్రోల్ అవుతుంది. అయితే ఈ చిట్కాను పాటించే ముందు ఎవరికైనా సందేహాలు ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ఈ చిట్కాను ఉపయోగించినప్పటికీ రక్తస్రావం అవుతూ నొప్పి అలాగే ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. నెలసరి నొప్పి తగ్గించే.. బెస్ట్ ఫుడ్స్‌లో కమలా పండు ఒకటి. ఆరెంజ్‌లో, నిమ్మకాయల కంటే ఎక్కువ విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి కూడా ఉంటాయి. కమలా పండులోని యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు పీరియడ్ క్రాంప్స్ తగ్గించడానికి సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే.. మీ డైట్ కమలా పండ్లు ఎక్కువగా తీసుకోండి.