Winter : శీతాకాలం మొదలైంది..ఇలా చేస్తే మీకు ఏ వ్యాధులు సోకవు …
Winter : చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల వస్తుంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచే ఆహారాలు తీసుకోవడం మంచిది
- By Sudheer Published Date - 07:51 PM, Sun - 10 November 24

చలికాలం (Winter Session) మొదలైంది..సాయంత్రం 06 అయితే చాలు గజగజ వణుకు పుడుతుంది. అలాగే చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల వస్తుంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచే ఆహారాలు తీసుకోవడం మంచిది.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు :
సీజనల్ పండ్లు మరియు కూరగాయలు: చలికాలంలో ప్రత్యేకంగా లభించే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం చాలా మంచిది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజన్ పండ్లలో సిట్రస్ పండ్లు (జామ, కమలా) కూడా రోగనిరోధక శక్తికి చాలా మంచివి.
బాదం పప్పు: బాదం రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులో జింక్ మరియు విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణజాలాలను రిపేర్ చేయడంలో, శరీరంలో వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
వేరుశెనగ: వేరుశెనగలలో ప్రోటీన్, ఫైబర్, రోగనిరోధక శక్తిని పెంచే ఖనిజాలు ఉంటాయి. చలికాలంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చు.
గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం.
అవిసె గింజలు: అవిసె గింజలలో కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
ఈ ఆహారాలు చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి మరియు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని ద్వారా వ్యాధుల నుండి బయటపడచ్చు.
Read Also : Afternoon Nap Benefits: మధ్యాహ్నం అరగంట నిద్రపోతే ఇన్ని లాభాలా!