Stress: ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ఒత్తిడి అదుపులో లేకపోతే అది ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:01 PM, Thu - 21 November 24

ఒత్తిడి ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను మరింత పెంచుతుంది. అంతేకాకుండా ఒత్తిడి బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. మీరు విన్నది నిజమే.. ఒత్తిడి మీ శరీరం బరువు పెరిగేందుకు కారణం కూడా అవుతుందట.అందుకే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. మనం ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం. దానివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. లేదంటే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది.
కార్టిసాల్ అనేది అధిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం విడుదల చేసే ఒక హార్మోన్. ఇది విడుదలైనప్పుడు ఆకలిని ప్రేరేపిస్తుంది. దానివలన అతిగా ఆకలి వేస్తుంది. అందుకే కార్టిసాల్ తగ్గించుకునేందుకు ఎలాంటి టిప్స్ పాటించాను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీర్ఘ శ్వాస కార్టిసాల్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ ని వ్యవస్థని ప్రేరేపిస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని కూడా తగ్గించేందుకు పనిచేస్తుందట. నిద్రలేమి పని ఎక్కువ అవ్వటం ఇంట్లో సమస్యలు మొదలైన కారణాల వల్ల ఒత్తిడి ఫీల్ అవుతారట. అటువంటి వాటి గురించి ఆలోచించడం తగ్గించాలి.
ఈ ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదుర్కొనే మార్గాలు అనుసరించాలట. అప్పుడే కార్టిసాల్ తగ్గుతాయట. తోటి వారితో ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగి ఉండాలని చెబుతున్నారు. అదేవిధంగా ఇష్టమైన వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయడం అలవాటు చేసుకోవాలట. కాసేపు ఫ్యామిలీతో గడిపితే ఒత్తిడి ఆలోచనలన్నీ దూరమవుతాయట. శారీరక శ్రమ, వ్యాయామం క్రమం తప్పకుండా చేయటం వలన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయట. అందుకే ధ్యానం యోగ వంటివి చేయటం వల్ల ఒత్తిడి అదుపులోకి వస్తుందట. అలాగే బరువు కూడా నియంత్రణలోనే ఉంటుందట. ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు మనసుకు హాయినిచ్చే సంగీతాన్ని వినడం మంచిది. అలాగే మనసు మైండ్ రెండు ప్రశాంతంగా ఉండే మార్గాల కోసం అన్వేషించడం మంచిది. ఎవరు లేని ప్రదేశంలో ఉండే ప్రదేశాలకు వెళ్లడం మంచిది. ఇలా చేస్తే మనసుకి హాయిగా ఉంటుంది.