Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ, టీలు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు కాఫీ టీలు తాగేటప్పుడు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:00 PM, Fri - 30 August 24

మామూలుగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారిని చాలా జాగ్రత్తగా ఉండమని వైద్యులు అలాగే పెద్దలు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతుంటారు. ఏది పడితే అది తినకూడదని, ఏదైనా తిన్నా కూడా లిమిట్ గా తిన్నారని చెబుతూ ఉంటారు. లేదంటే తల్లికి అలాగే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అని చెబుతూ ఉంటారు. అలాగే చాలామంది స్త్రీలు ప్రెగ్నెన్సీకి ముందు ఏ విధంగా అయితే కాఫీలు టీలు తాగేవారో ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అదే విధంగా కాఫీలు టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎక్కువగా కాఫీలు టీలు తాగకూడదని వైద్యులు చెబుతుంటారు.
మరి ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీలు టీలు తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణ మనుషులతో పోల్చుకుంటే గర్భిణీ స్త్రీల నుంచి టిఫిన్ బయటకు రావడానికి ఒకటిన్నర నుంచి మూడు రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. మీరు ప్రెగ్నెన్సీ టైంలో కెఫిన్ ఎక్కువ తీసుకుంటే అది మీ శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది. దీని వల్ల ఇది మావిలో చేరి బిడకడ రక్త ప్రవాహంలోకి చేరుతుంది. ఇది రక్తప్రవాహంలోకి చేరితే పిల్లల ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుందట.. అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే మహిళలు రక్తపోటు హృదయ స్పందన రేటు పెంచుతుందని చెబుతున్నారు. అలాగే కెఫిన్ నిద్ర సమస్యలను కూడా కలిగిస్తుందని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కెఫిన్ సున్నితంగా మారుతారు.
ఎందుకంటే అవి రక్తం నుంచి శుభ్రపడటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల తలనొప్పి, నీరసం, వికారం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవారి ఆరోగ్యానికి సంబంధించిన ఈ పరిస్థితి ప్రభావం పిల్లల ఆరోగ్యంపై కూడా పడుతుందట. ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందట. అంతేకాదు ఇది వంధ్యత్వంతో ముడిపడి ఉంటుందట. అందుకే ప్రెగ్నెన్సీలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా టీ, కాఫీలను నివారించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కాఫీలు టీలు తాగకుండా ఉండలేము అనుకున్న వారు వాటిని తీసుకున్నప్పటికీ చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు. మహిళ ప్రతిరోజూ 200 మి.గ్రా కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే.. గర్భస్రావం ప్రమాదం పెరుగుతుందట. అందుకే మీరు కెఫిన్ ను సాధ్యమైనంత వరకు పరిమితం చేయండని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.