Winter Drink: తులసి, మిరియాలు కలిపిన నీరు తాగితే ఏమవుతుందో తెలుసా? మార్పులను అసలు నమ్మలేరు!
Winter Drink: తులసి ఆకులు, మిరియాలు కలిపి మరిగించి తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి ఈ నీరు తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 16-11-2025 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
Winter Drink: శీతాకాలం మొదలయ్యింది. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. అయితే ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించాలి. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం.. అయితే ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో మిరియాలు చేర్చుకోవాలట. శీతాకాలంలో అతి పెద్ద సమస్య గొంతు నొప్పి. గొంతు నొప్పితో, గొంతు బొంగురు పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది.
దీనివల్ల భోజనం తినడం కూడా కష్టమవుతుందట. దీనికి పరిష్కారంగా కోసం చాలా మంది వేడి నీళ్లు తాగుతూ ఉంటారు. వేడి నీటిని తాగే బదులు ఈ ప్రత్యేక పానియం తాగవచ్చట. దీన్ని తీసుకోవడం వల్ల గొంతు బొంగురు పోవడం సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుందట. ఈ పానియం తయారు చేయడానికి ఐదు తులసి ఆకులు, రెండు నల్ల మిరియాలు, ఒక చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి బాగా మరిగించాలట. తర్వాత వడకట్టి చల్లబరిచి ఈ నీటిని తాగాలట. శీతాకాలంలో దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.
ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని, మిరియాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం కొన్ని తులసి ఆకులు, మిరియాలు తీసుకొని నీటిలో బాగా మరిగించి ఆ నీటిని తాగాలని చెబుతున్నారు. కాగా మిరియాలు చలికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయట. కాబట్టి ఈ నీటితో పాటుగా తులసి ఆకులను, మిరియాలను శీతాకాలంలో మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది.