High BP – 18 Crore Indians : ‘సైలెంట్ కిల్లర్’ గుప్పిట్లో 18 కోట్ల మంది ఇండియన్స్ : డబ్ల్యూహెచ్ఓ
High BP - 18 Crore Indians : సైలెంట్ కిల్లర్ గా పేరొందిన ‘హైబీపీ’ సైలెంట్ గా మన దేశంలో 18.83 కోట్ల మందిని తన గుప్పిట్లోకి తీసుకుంది.
- By Pasha Published Date - 10:00 AM, Wed - 27 September 23

High BP – 18 Crore Indians : సైలెంట్ కిల్లర్ గా పేరొందిన ‘హైబీపీ’ సైలెంట్ గా మన దేశంలో 18.83 కోట్ల మందిని తన గుప్పిట్లోకి తీసుకుంది. అయితే వీరిలో కేవలం 37 శాతం మందికే తమకు హైబీపీ ఉన్న విషయం తెలుసు. ఈమేరకు వివరాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. హైబీపీ అనేది గుండెపోటు, స్ట్రోక్స్ వంటి హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. వీటి వల్లే భారత్ లో 52% మరణాలు సంభవిస్తున్నాయని రిపోర్ట్ లో పేర్కొన్నారు. హైబీపీ సమస్యను వెంటనే గుర్తించి.. వైద్య చికిత్సతో అదుపులోకి తేగలిగితే లక్షలాది మంది ప్రాణాలను కాపాడొచ్చన్నారు. ఇండియాలోని 27 రాష్ట్రాల్లో హైబీపీ ఉన్న 58 లక్షల మంది ఇండియన్ హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (IHCI) కింద చికిత్స పొందుతున్నారు. అయితే వారికి తగినన్ని మందులు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
Also read : IAS Without Coaching : జాబ్ చేస్తూ.. కోచింగ్ లేకుండానే సివిల్స్ లో విజయఢంకా
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ముగ్గురు పెద్ద వయస్కులలో ఒకరికి అధిక రక్తపోటు ఉందని నివేదిక తెలిపింది. హైబీపీ ఉన్నవారిలో 80 శాతం మందికి సరైన చికిత్స అందడం లేదని పేర్కొంది. ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు మందికి హైబీపీ ఉండగా.. వారిలో సగం మందికే మాత్రమే ఆ విషయం తెలుసని వివరించింది. వరల్డ్ వైడ్ గా ఏటా 46 లక్షల మంది గుండెపోటు, స్ట్రోక్‌లతో మరణిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు.