Onion: వారం రోజులు ఉల్లిపాయ తినకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వారం రోజుల పాటు ఉల్లిపాయ తినకపోతే ఏమవుతుంది అన్న విషయం గురించి తెలిపారు.
- By Anshu Published Date - 01:00 PM, Thu - 24 October 24

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను మనం వినే ఉంటాం. దాని అర్థం ఉల్లిపాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని. అలాంటి ఉల్లిపాయను తరచుగా తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కొందరు కూరలతో పాటు తింటే మరికొందరు పచ్చి ఉల్లిపాయ కూడా తింటూ ఉంటారు. పచ్చి ఉల్లిపాయ కూడా తినడానికి ఎంతో బాగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే ఉల్లిపాయ ఒక వారం రోజుల పాటు తినకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉల్లిపాయల్లో అల్లైల్ ప్రొఫైల్ డైసల్ఫైడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్, విటమిన్ బి 6, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాగా ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మన పొట్ట శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఒక వారం పాటు తినకపోతే మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. ఉల్లిపాయలను తింటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా బలంగా ఉంటుంది. అదే మీరు ఒక వారం పాటు ఉల్లిపాయలని తినకపోవడం వల్ల మీ శరీరంలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా తగ్గుతాయట. దీంతో మీ ఇమ్యూనిటీ పవర్ కూడా బలహీనంగా మారుతుందని, దీంతో మీకు వ్యాధులు ఎక్కువగా సోకుతాయని చెబుతున్నారు.
ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మీరు ఉల్లిపాయల్ని వారం పాటు తినకపోతే మీ శరీరంలో వాపు సమస్యలు వస్తాయట. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఉల్లిపాయలు మనల్ని బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయట. అయితే మీరు ఉల్లిపాయల్ని తినడం ఆపేస్తే మీరు బాగా అలసటకు గురవుతారట. అలాగే ఎర్ర రక్త కణాలు ఏర్పడటం, రక్తం గడ్డకట్టడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఉల్లిపాయల్ని తినడం వల్ల కోపం, దూకుడు, అజ్ఞానం, బద్ధకం, ఆందోళన, లైంగిక కోరికలు వంటి కొన్ని ప్రతికూల భావోద్వేగాలు పెరుగుతాయట. అయితే మీరు వారం పాటు ఉల్లిపాయల్ని తినడం మానేస్తే మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. మీరు ఒక వారం రోజులు ఉల్లిపాయల్ని తినకపోవడం వల్ల మీ ఆందోళన కూడా చాలా వరకు తగ్గుతుందని కొంతమంది అంటున్నారు. దీనిని తినకపోవడం వల్ల మీ మెదడు విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరుకుతుందట.