Periods: పీరియడ్స్‌కు నాలుగైదు రోజుల ముందు జననాంగంలో నొప్పి వస్తే ఏం చేయాలి..?
అమ్మాయిలు, మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి. దాదాపు 11 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ప్రారంభమయ్యే బుతుస్రావం ప్రక్రియ 50 సంవత్సరాల వరకు కొనసాగుతోంది. ఆ తర్వాత ఆగిపతుంది.
- Author : Anshu
Date : 15-05-2023 - 9:24 IST
Published By : Hashtagu Telugu Desk
Periods: అమ్మాయిలు, మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి. దాదాపు 11 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ప్రారంభమయ్యే బుతుస్రావం ప్రక్రియ 50 సంవత్సరాల వరకు కొనసాగుతోంది. ఆ తర్వాత ఆగిపతుంది. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. భరించలేని నొప్పి, రక్తస్రావం వల్ల ఇబ్బందికి గురవుతారు. ఆ సమయంలో పనులేవి చేయలేరు. రక్తస్రావం అవ్వడం వల్ల నీరసించిపోవడం, చికాకు పడటం, తలనొప్పి, కడుపునొప్పి, వికారం లాంటి సమస్యలు వస్తాయి.
అయితే కొంతమంది యుక్త వయస్సు లేదా మహిళలకు పీరియడ్స్ వచ్చే నాలుగైదు రోజుల ముందు నుంచి జననాంగంలో నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో పీరియడ్స్ పూర్తయ్యేంతవరకు నొప్పితో బాధపడుతూ ఉంటారు. నెలసరికి ముందే యోనిలో నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. డెలివరీ సమయంల సిజేరియన్ ఆపరేషన్ చేసుకునేవారికి యోనిలో పీరియడ్స్‌కు ముందే నొప్పి వచ్చే అవకాశముంటుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి వల్ల కూడా పీరియడ్స్‌కు ముందే యోనిలో నొప్పి రావొచ్చని చెబుతున్నారు.
ఎండోయోట్రియాసిస పొట్టలో ఉండటం వల్ల అతుకులు ఏర్పడతాయని, దీని వల్ల కూడా నొప్పి వస్తుందని చెబుతున్నారు. ఇక జననాంగంలో ఇన్ఫెక్షన్లు, గర్బాశయ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మహిళల్లో పీరియడ్స్‌కు ముందే యోనిలో నొప్పి రావొచ్చని అంటున్నారు. ఇలాంటి సమయాల్లో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీని వల్ల సమస్య తొలగిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే చాలా ప్రమాదకరమని, ఇన్పెక్షన్ పెరిగేపోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు. పీరియడ్స్ కు ముందే నొప్పితో బాధపడే మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తొలగిపోయే అవకాశం ఉంటుంది.