Coconut Water: ఉదయం లేదా మధ్యాహ్నం.. కొబ్బరినీరు ఎప్పుడు తాగితే మంచి జరుగుతుందో తెలుసా?
కొబ్బరి నీటిని ఎప్పుడు తాగాలి? ఉదయం లేదంటే మధ్యాహ్నం ఏ సమయంలో తాగితే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:34 PM, Fri - 21 March 25

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలంలో ఆహార పదార్థాల కంటే ఎక్కువగా పానీయాలు తాగుతూ ఉంటారు. ఎక్కువ వేడి కారణంగా దాహం పెరిగి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో కొబ్బరి నీరు కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కొబ్బరి నీరు ఇష్టపడి తాగుతూ ఉంటారు. కొబ్బరి నీటిలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇకపోతే మంచి ప్రయోజనాలు కలిగిన కొబ్బరి నీటిని ఉదయం లేదా మధ్యాహ్నం ఏ సమయంలో తీసుకుంటే మంచి జరుగుతుందో మంచి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆరోగ్య పరిస్థితుల గురించి పక్కన పెడితే మామూలుగా చాలా మంది మధ్యాహ్నం సమయంలోనే ఈ కొబ్బరి నీటినీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంతకీ ఈ కొబ్బరి నీటిని ఏ సమయంలో తాగాలి అన్న విషయాన్ని వస్తే.. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు కేవలం ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల బరువు నిర్వహణ, చర్మ హైడ్రేషన్ ను మెరుగుపరచడం,బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లను నివారించవచ్చని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల దీన్ని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవట. కాగా ఒక కప్పులో 45 కేలరీలు మాత్రమే ఉంటాయి.
కాబట్టి మీకు సోడా లేదా ఇతర చక్కెర పానీయాలు తాగాలి అనిపించినప్పుడు, సాధారణ నీటిని తాగడం మంచిదని చెబుతున్నారు. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుందట. శరీరం జీవక్రియను ప్రారంభిస్తుందట. కొబ్బరి నీళ్లను సాయంత్రం పూట తాగడం కంటే ఉదయాన్నే మితంగా తాగడం మంచిదని చెబుతున్నారు. కొబ్బరి నీరు ఒక అద్భుతమైన సహజ ఎలక్ట్రోలైట్ మూలం, ఇది వ్యాయామం అనంతర రీహైడ్రేషన్‌కు గొప్ప ఎంపిక అని చెప్పాలి. అలాగే రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉంటే కొబ్బరినీళ్లు తాగకూడదట. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి కిడ్నీ జబ్బులు, గుండె సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదని చెబుతున్నారు. కొంతమంది నిద్రపోవడానికి ముందు తాగుతూ ఉంటారు. కానీ ఇది అసలు మంచిది కాదని చెబుతున్నారు.