Diabetes: షుగర్ ఉన్నవారు టాబ్లెట్స్ ని ఎప్పుడు వేసుకోవాలి.. భోజనానికి ముందా లేక భోజనం తర్వాతనా?
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న టాబ్లెట్స్ ని ఎప్పుడు వేసుకోవాలి. భోజనానికి ముందు వేసుకోవాలా, లేక భోజనం తర్వాత వేసుకోవాలా, ఒకవేళ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చి పోతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:00 PM, Sun - 18 May 25

షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు టాబ్లెట్స్ ని ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. ఒక్క పూట మిస్ చేసినా కూడా అప్పుడే షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే వైద్యులు షుగర్ పేషెంట్లను తగిన ఫుడ్ తీసుకోవడం లేదంటే టాబ్లెట్స్ ని మింగడం లాంటివి చేయమని చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి టాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఒక సందేహం నెలకొంటూ ఉంటుంది. అదేమిటంటే టాబ్లెట్లను ఎప్పుడూ వేసుకోవాలి? భోజనానికి ముందు వేసుకోవాలా లేదంటే భోజనం తర్వాత వేసుకోవాలా అని కన్ఫ్యూజన్ పడుతూ ఉంటారు.
అలా అనుకుంటూనే చాలా మంది టాబ్లెట్స్ వేసుకోవడం మరిచిపోతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఇంతకీ టాబ్లెట్లను ఎప్పుడు వేసుకోవాలి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. షుగర్ ఉన్నవారు డైట్, మెడిసిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. అప్పుడే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుందట. అయితే, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వైద్యుల సలహా నేరకు టాబ్లెట్లను వారు ఎప్పుడు చెబితే అప్పుడు వేసుకోవడం మంచిది.
అలాకాకుండా మరిచిపోయి భోజనానికి ముందు మింగాల్సినవి తర్వాత, ఆ తర్వాత మింగాల్సినవి ముందు మింగితే లేనిపోని సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. కొన్ని మెడిసిన్స్ భోజనానికి 15 నుంచి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయట. ఈ మెడిసిన్ ఆహారం నుండి గ్లూకోజ్ పెరుగుదలని బ్యాలెన్స్ చేసి ఇన్సులిన్‌ని విడుదల చేస్తాయట. మరికొన్ని ట్యాబ్లెట్స్ భోజనంతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఫుడ్ లోని కార్బోహైడ్రేట్స్ శోషణ నెమ్మదిస్తుందట. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవట. వీటిని ఆహారంతో పాటు, లేదా ఐదు నిమిషాల ముందు తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని ట్యాబ్లెట్స్ భోజనానికి ముందు వేసుకుంటే గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకి కారణమవుతాయి. కాబట్టి వాటిని ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలట.