Honey-Dates: తేనెలో ఖర్జూరం నానబెట్టి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
తేనెలో ఖర్జూరం నానబెట్టి తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:00 PM, Mon - 12 May 25

తేనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తేనెను ఎన్నో రకాలుగా ఉపయోగించడంతో పాటుగా ఆహార పదార్థాలతో కలిపి తింటూ ఉంటారు. తేనెను డైరెక్ట్ గా కూడా తింటూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే పదార్థాలలో తేనె కూడా ఒకటి. ఒరిజినల్ తేనెకు ఎక్స్పైరీ డేట్ అనేది లేదు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మనకు మార్కెట్లో చాలా రకాల తేనె లభిస్తున్నప్పటికీ అందులో చాలా వరకు కల్తి ఉన్నవే వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఖర్జూరాల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలలో న్యాచురల్ గానే షుగర్ పుష్కలంగా ఉంటుంది. కాగా ఖర్జురాలను తేనెలో నానబెట్టి తినడం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయట. అలాగే ఖర్జూరాల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఈ రెండూ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని చెబుతున్నారు. ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందట.
ఇది బరువును తగ్గించడం నుంచి జీర్ణ సమస్యలను తగ్గించడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే జీర్ణశక్తిని మెరుగుపడుతుందట. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందట. తరచూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు ఖర్జూరం తేనెలో నానబెట్టి తినడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చట. ఫైబర్ లోపం వల్లే మలబద్దకం సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని తింటే ఫైబర్ లోపం తగ్గుతుందట. అలాగే జీవక్రియ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే తింటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందట. ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా ఉన్నవారు ఖర్జూరం నానబెట్టి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుందట. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె, ఖర్జూరాలు బాగా సహాయపడతాయట. ఈ రెండింటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ఐరన్ తో పాటుగా జింక్, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయని చెబుతున్నారు. కండరాలు పెంచాలనుకునే వారికి తేనె, ఖర్జూరాలు బాగా సహాయపడతాయట. తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తింటే కండరాలు వేగంగా పెరుగుతాయని చెబుతున్నారు. తేనెలో, ఖర్జూరాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్ మీరు కండరాలను పెంచడానికి బాగా సహాయపడుతుందని చెబుతున్నారు.