Rice water: గంజి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?
ఇదివరకటి రోజుల్లో అన్నం ని కట్టెల పొయ్యి మీద ఉండడంతో పాటు అన్నంలో వచ్చే గంజిని కూడా తాగేవారు. కానీ రాను
- By Anshu Published Date - 06:30 AM, Thu - 16 February 23

ఇదివరకటి రోజుల్లో అన్నం ని కట్టెల పొయ్యి మీద ఉండడంతో పాటు అన్నంలో వచ్చే గంజిని కూడా తాగేవారు. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో అన్నం చేసే క్రమంలో గంజి కూడా లేకుండా అలాగే అన్నం మొత్తం అయిపోయే లాగా చేసుకొని తింటున్నారు. అన్నం గంజి ఒంపే ఓపిక ఎలక్ట్రికల్ కుక్కర్ లను ఉపయోగిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాలలో అన్నంలో గంజిని తీసి తాగుతూ ఉంటారు. అయితే ఈ తరం వారికి అదొక సూప్ లాగా భావించినప్పటికీ అప్పట్లో అది మెయిన్ ఫుడ్ గా భావించేవారు. కాగా ఈ గంజిని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మరి ఈ గంజి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గంజిలో ఎన్నో హెల్దీ న్యూట్రియెంట్స్ ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. కాగా గంజిలో స్టార్చ్ పోషకాలతో పాటు విటమిన్ బి, విటమిన్ సి, మినరల్స్ లభిస్తాయి. అలాగే గంజిని తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, అజీర్ణం వంటి సమస్యల్ని దూరం చేసుకునేందుకు ఈ నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. డయేరియా వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ గంజి నీటిని తాగితే కడుపులో ఆసరాగా ఉంటుంది. ఇందులోని విటమిన్స్, మినరల్స్ శక్తిని ఇస్తాయి. నీరు తాగడం ప్రతిసారి ఇబ్బందిగా అనిపిస్తే దాని బదులు గంజి కూడా తాగొచ్చు.
దీనిని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. శక్తిని ఇచ్చే డ్రింక్స్‌లో ఈ గంజి కూడా ఒకటి. వాంతులు, జ్వరం, ఇన్ఫెక్షన్స్ సమస్యలతో బాధపడేవారు గంజిని తాగడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది. బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని గంజిలోనూ అందుతాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు తిరిగి అందుతాయి. మానసిక స్థితి మెరుగ్గా మారుతుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉపవాసం ఉన్నవారు తర్వత రోజు ఉదయం గంజి నీటిని తీసుకుంటారు. దీంతో తక్షణ శక్తి సొంతమవుతుంది.