Over Sleep: ఏంటి అతి నిద్ర కూడా అంత మంచిది కాదా.. ఎక్కువసేపు నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదే కానీ అతి నిద్ర కూడా అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అతిగా నిద్రపోతే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:25 PM, Tue - 25 March 25

నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కంటి నిద్ర లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే కంటి నిండా నిద్రపోవాలని ప్రతి రోజు 8 గంటల నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే నిద్ర మంచిదే కానీ అది నిద్ర కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు. మరి ఎక్కువ సమయం అతిగా నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మనిషికి కనీసం 8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 10 నుంచి 12 గంటలు నిద్రపోయే వారు కూడా ఉన్నారు. ఏ పనులు చేయకుండా ఖాళీగా ఉండటం వల్లే ఇలా నిద్రపోతారు. కానీ ఇది మిమ్మల్ని సోమరిగా మార్చడమే కాకుండా, ఎన్నో రోగాలు వచ్చేలా కూడా చేస్తుందట. ఎక్కువసేపు నిద్రపోయే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోయేవారిలో డిప్రెషన్ కు గురయ్యే అవకాశం 27 శాతం ఉంటుందట. అలాగే 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి 49 శాతం ఈ ప్రమాదం ఎక్కువ ఉందని చెబుతున్నారు.
అలాగే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందట. ఎక్కువ సేపు నిద్రపోయే ఆడవారు తల్లులు కావడం కష్టమవుతుందట. రోజుకు 7 లేదా 8 గంటలు నిద్రపోయే మహిళలు గర్భం ధరించే అవకాశం ఉందట. అలాగే 9 లేదా 11 గంటలు నిద్రపోయే ఆడవారు గర్భందాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నిద్రవేళలో వ్యత్యాసం మన శరీరంలోని హార్మోన్ గ్రంథుల పనితీరును ప్రభావితం చేసి రుతుచక్రానికి కారణమవుతుందని చెబుతున్నారు.
రాత్రిపూట 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవారికి షుగర్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందట. అలాగే రాత్రిపూట 7 లేదా 8 గంటలు నిద్రపోయే వ్యక్తుల గ్లూకోజ్ స్థాయిలపై పెద్దగా ప్రభావం పడదట. రాత్రిపూట 7 లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే ఆడవారు అధిక బరువుతో ఉన్నట్లు చెబుతున్నారు. రాత్రిపూట 9 నుంచి 10 గంటలు నిద్రపోయే ఆడవారికి సరైన ఆహార నియంత్రణ, వ్యాయామం ఉన్నప్పటికీ వారి శరీర బరువులో 25 శాతం పెరిగారట. స్థూలకాయానికి, బరువు పెరగడానికి నిద్ర సమయం కూడా ఒక ప్రధాన కారణం అని చెబుతున్నారు వైద్యులు.