HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens When People With Diabetes Eat Cloves

Cloves: షుగర్ వ్యాధిగ్రస్తులు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు లవంగాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Author : Anshu Date : 30-07-2024 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cloves
Cloves

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో లవంగాలు కూడా ఒకటి. లవంగాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్నా విషయం మనందరికి తెలిసిందే. వీటిని ఎన్నో రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వంటల్లో ఉపయోగించడం వల్ల కూరకు రుచి పెంచడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఈ లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. అయితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న ఈ లవంగాలను డయాబెటిస్ పేషెంట్లు తినవచ్చా తినకూడదా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న లవంగాలు డయాబెటీస్ పేషెంట్లకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ లవంగాల్లో ఉండే పోషకాలు జీవక్రియ సమస్యలను తగ్గిస్తాయట. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని, దాంతో మన శరీరం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటుందని చెబుతున్నారు. కాగా లవంగాల్లో ఫైబర్, కాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి సహాయపడతాయి. కాగా లవంగాలు డయాబెటీస్ పేషెంట్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందట.

మధుమేహులు లవంగాలను ఇన్సులిన్ హార్మోన్లు, జీవక్రియ, శక్తిని ప్రేరేపించడానికి రోజూ లవంగాలను తినవచ్చు. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి లవంగాలు తినడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందట. కాగా లవంగాలను ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 1.5 గ్రాముల లవంగాలు తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు.
ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో లవంగాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని చెబుతున్నారు. ఈ లవంగాలను తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఇకపోతే లవంగాలు తరచూ తీసుకోవడం వల్ల కడుపు రుగ్మతలు, వాంతులు, వికారం వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cloves
  • cloves benefits
  • health benefits
  • health tips

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

  • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd