Curd: ఏంటి.. పెరుగుతో బరువు తగ్గవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
పెరుగు తినడం వల్ల కేవలం బరువు పెరగడం మాత్రమే కాకుండా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. మరి పెరుగును ఎలా తీసుకుంటే బరువు తగ్గవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:00 AM, Sat - 17 May 25

పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును తరచుగా తినడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. రోజులో కనీసం ఒక్కసారైనా పెరుగు తినందే చాలా మందికి ముద్ద కూడా దిగదు. కొంతమంది పెరుగు తింటే మరి కొంతమంది మజ్జిగ చేసుకుని తాగుతూ ఉంటారు. కాగా పెరుగులో ప్రో బయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, బి2, బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పెరుగు జీర్ణక్రియను మెరుగు పరచడానికి అలాగే ఎముకలను బలోపేతం చేయడానికి, పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది అని చెబుతున్నారు.
అయితే పెరుగును తరచుగా తినడం వల్ల ఈజీగా బరువు కూడా తగ్గవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా పెరుగు అధిక ప్రోటీన్లతో నిండి ఉంటుందట. అయితే బరువు తగ్గాలి అనుకునేవాళ్లు ప్రోటీన్ ని తీసుకోవాలి. ఆ ప్రోటీన్ పెరుగులో పుష్కలంగా ఉంటుందట. మనల్ని సంతృప్తి పరచడంలోను అలాగే ఆకలి తగ్గించడంలోనూ సహాయపడుతుందట. క్రమం తప్పకుండా తీసుకుంటే, పెరుగు లోని ప్రోటీన్ మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుందని, ఇది మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఇతర ఆహారాలు అతిగా తినే అలవాటును తగ్గిస్తుందట. కాగా పెరుగులో సహజంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నవారికి ఇది ఆదర్శవంతమైన ఆహారం అని చెబుతున్నారు. మీ ఆహారంలో ఎక్కువ కేలరీలు జోడించకుండా, కంట్రోల్ చేయడానికి సహాయం చేస్తుందని చెబుతున్నారు.
పెరుగులో లభించే ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు మద్దతు ఇస్తుందట. ఇది జీవక్రియను పెంచడానికి కీలకమైనదని, ఆరోగ్యకరమైన గట్ జీర్ణక్రియ,పోషకాల శోషణను పెంచుతుందని చెబుతున్నారు. పెరుగు తక్కువ కొవ్వు పాలతో తయారు చేసినప్పుడు, పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడే కాల్షియం, ప్రోబయోటిక్స్ ఉంటాయట. కాల్షియం శరీరాన్ని ఎక్కువ కొవ్వును కాల్చడానికి ప్రోత్సహిస్తుందట. మరి ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో, ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. పెరుగు ప్రోబయోటిక్స్, లేదా మంచి బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాను ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుందట. సరైన జీర్ణక్రియ శరీరాన్ని సమర్ధవంతంగా ప్రాసెస్ చేస్తుందని, అలాగే పోషకాలను గ్రహించి కడుపు ఉబ్బరం తగ్గిస్తుందని చెబుతున్నారు. సాధారణ ప్రేగు కదలికలను నిర్వహిస్తుందట. పెరుగు తీసుకోవడం కార్బోహైడ్రేట్ల శోషణను మందగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందట. ఇది ఇన్సులిన్ స్పైక్ లను నిరోధించడంలో సహాయపడుతుందని, ఇది కొవ్వు నిల్వకు దారితీస్తుందని,స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చక్కెర కోరికలను తగ్గిచి మీ ఆహారాన్ని నియంత్రించడాన్ని సులభతరం చేస్తాయని చెబుతున్నారు.