Turmeric Water: ప్రతిరోజు పరగడుపున పసుపు నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:55 PM, Sat - 25 January 25

పసుపు నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నీటిలో అనేక పోషకాలు ఉంటాయి. పసుపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఉటాయి. ఇవి చాలా రకాల వ్యాధుల నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు. ఇందుకు మార్కెట్లో దొరికే పసుపు కంటే పచ్చి పసుపు ఇంకా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.. అయితే ఇందుకోసం ముందుగా పచ్చి పసుపు తీసుకొని బాగా దంచుకోవాలి. ఆ పచ్చి పసుపు నీళ్లలో వేసి ఉడికించి ఆ నీళ్లు చల్లార్చి ఆ తర్వాత పరగడుపున తాగాలి.
ఈ విధంగా తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు నీరు తాగడం వల్ల మెటబాలిజం వేగవంతం అవుతుంది. మెటపాలిజం వేగంగా ఉంటే ఈజీగా వేగంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గించేందుకు రోజు క్రమం తప్పకుండా పరిగడుపున ఈ పసుపు నీళ్ళు తాగడం వల్ల తొందరగా ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకున్నవారికి పసుపు నీరు మంచి ఎంపిక అని చెబుతున్నారు. పసుపు నీరు తాగితే జీర్ణ క్రియ మెరుగవుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
తద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. పసుపు నీటిలో ఫైబ్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. దాంతో బరువు చాలా వేగంగా తగ్గవచ్చు. బరువు తగ్గించాలనుకుంటే ఉదయం పరగడుపున పసుపు నీరు తాగాలి. దీనికోసం పచ్చి పసుపు వాడటం మంచిదని చెబుతున్నారు. పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య తగ్గుతుంది. పసుపు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ ఇన్ఫమ్లేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో పసుపు నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిక్ బాధితులకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.