Watermelon: ఎప్పుడైన పుచ్చకాయలోని తెల్లని భాగం తిన్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
పుచ్చకాయలోని కేవలం ఎర్రటి భాగం వల్ల మాత్రమే కాకుండా తెల్లటి భాగం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:02 AM, Thu - 3 April 25

వేసవికాలంలో దొరికే అద్భుతమైన పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. ఈ పండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవికాలంలో ఈ పండు తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలా అని ఎక్కువగా తినడం కూడా అంత మంచిది కాదు. అయితే పుచ్చకాయ తినేటప్పుడు చాలామంది చేసే చిన్న తప్పు ఎర్రటి భాగాన్ని తినేసి తెల్ల భాగం పారేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పుచ్చకాయలోని తెల్లటి భాగం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట.
ఇందులో సిట్రుల్లైన్ అనే ఒక రకమైన అనావశ్యక అమైనో ఆమ్లం ఉంటుందట. పుచ్చకాయలోని తెల్లని భాగం తినడం వల్ల శరీరంలో దీని స్థాయి పెరుగుతుందట. సిట్రులిన్ మన రక్త నాళాలను విస్తరిస్తుందట. పుచ్చకాయలోని తెలుపు, ఇతర భాగాలు పెద్దలలో అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయట. పుచ్చకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుందట. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.
పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా కడుపు నింపుతాయి. ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. బరువును నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి ఇక మీదట మీరు పుచ్చకాయ తినేటప్పుడు అందులో ఎర్రటి భాగంతో పాటు తెల్లటి భాగం కూడా తినండి. దీనివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. కాగా పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి కావలసిన నీటిని అందించడంతో పాటు డిహైడ్రేషన్, అలసట వంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.