Heart Attack: చెవిలో కనిపించే ఈ లక్షణం.. హార్ట్ ఎటాక్ హెచ్చరిక సంకేతం కావొచ్చు!
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గత ప్రధాన కారణాలలో హార్ట్ ఎటాక్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం, 2016లో.. 17.9 మిలియన్ల మంది CVDల కారణంగా మరణించారు. ఇది మొత్తం ప్రపంచ మరణాలలో 31 శాతానికి సమానం.
- By Anshu Published Date - 06:30 AM, Wed - 3 August 22

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గల ప్రధాన కారణాలలో హార్ట్ ఎటాక్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం, 2016లో.. 17.9 మిలియన్ల మంది కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) ల కారణంగా మరణించారు. ఇది మొత్తం ప్రపంచ మరణాలలో 31 శాతానికి సమానం. ఈ మరణాలలో.. 85 శాతం గుండెపోటు కారణంగా సంభవించాయని గణంకాలు సూచిస్తున్నాయి. అయితే ముందస్తుగా వ్యాధిని పసిగట్టకపోవడమే మరణాల సంఖ్య పెరగడానికి గల ప్రాథమిక కారణాలలో ఒకటిగా ఉంది.
ముందస్తు సంకేతాలు లేకుండా ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చే సందర్భాలు అన్నమాట. అయితే లక్షణాలు కనిపించినప్పటికీ.. అవి సాధారణమైనవిగా భావించడం, తప్పుగా అంచనా వేయడం వల్ల ప్రమాదం పొంచి ఉంది. అయితే హార్ట్ ఎటాక్ సంబంధించిన కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూసేయండి..
Also Read: Fat Burning : ఈ ఏడు పదార్థాలను ఎంత తిన్నా లావు కారు…మీరు ట్రై చేయండి..!!!
US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలావరకు ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యాన్ని గురవుతారు. అది కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటుంది లేదా నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లి వస్తుంది. ఆ సమయంలో అసౌకర్యమైన ఒత్తిడి, పిండడం, నొప్పి వంటి అనుభూతి చెందుతారు. అప్పుడు బలహీనంగా, మూర్ఛగా అనిపిస్తుంది. చల్లని చెమటలు కారడానికి కూడా అవకాశం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. హార్ట్ ఎటాక్ లక్షణాలు పురుషులు మరియు స్త్రీలలో మారవచ్చు.
స్త్రీలలో హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కనిపించే అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి (ఆంజినా) లేదా అసౌకర్యం. అవేకాకుండా.. స్త్రీలు శ్వాసలోపం, వికారం, వాంతులు, వెన్ను లేదా దవడ నొప్పి అనుభవించే అవకాశం ఉంది. అయితే మన శరీరం అంతర్గతంగా చోటుచేసుకునే తప్పులకు సంబంధించిన సంకేతాలను పంపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. ఈ కోవలోనే హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన అసాధారణ సంకేతాన్ని చెవి కలిగి ఉంది. చెవి కింద మెత్తగా ఉండే ప్రాంతాన్ని ఇయర్ లోబ్ అంటారు.
Also Read: High BP : బీపీ టాబ్లెట్స్ వేసుకొని విసుగు చెందారా…అయితే ఈ పండు తిని చూడండి..!!
ఇక్కడే అమ్మాయిలు చెవిరింగులు పెట్టుకోవడానికి రంధ్రాలు చేస్తుంటారు. ఈ లోబ్ కాస్త నొత్త పడినట్టు వంపు తిరిగి ఉన్నట్టు కనిపిస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. ఈ సంకేతాన్ని ఫ్రాంక్స్ సైన్ (Frank’s sign) అని పిలుస్తారు. ఇది చెవి లోబ్‌లోని ఒక డయాగ్నొల్ క్రీజ్.. ట్రాగస్ నుంచి లోబుల్ మీదుగా కర్ణిక వెనుక అంచు వరకు విస్తరించి ఉంది. ఛాతీ నొప్పి, కరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ ఉన్న రోగులలో క్రీజ్‌ను మొదటిసారిగా గమనించిన సాండర్స్ టి. ఫ్రాంక్ (Saunders T. Frank) పేరు మీద ఈ పరిస్థితికి Frank’s sign పేరు పెట్టారు.
ఇది కార్డియాక్ పాథాలజీకి సంబంధించినదని.. కొరోనరీ ఆర్టరీ అథెరోస్క్లెరోసిస్‌తో బలంగా సంబంధం కలిగి ఉందని పేర్కొంది. అయితే ఇందుక సంబంధించి ఖచ్చితమైన సమాధానం లేదా నిరూపించడానికి బలమైన ఆధారాలు లేవు. ఇక, ఫ్రాంక్స్ సైన్.. సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్లను అంచనా వేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది అకాల వృద్ధాప్యం, చర్మ, వాస్కులర్ ఫైబర్‌ల నష్టాని కూడా తెలియజేస్తుంది.
Also Read: Diabetes: మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?