Vitamin E Capsule: మీరు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ 3 సమస్యలు వచ్చే అవకాశం..?
- By Gopichand Published Date - 12:30 PM, Sun - 30 June 24
 
                        Vitamin E Capsule: ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి అబ్బాయిలు, అమ్మాయిలు చాలా వస్తువులను ఉపయోగిస్తారు. అంతే కాదు కొందరు తమ ముఖం మెరిసిపోవడానికి కొన్ని ప్రొడక్ట్స్ అతిగా వాడుతుంటారు. దీని కారణంగా వారి ముఖంపై మొటిమలు, మచ్చలు, అలెర్జీలు వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో ముఖంపై అవసరమైన దానికంటే ఎక్కువగా విటమిన్ ఇ క్యాప్సూల్స్ (Vitamin E Capsule) ఉపయోగిస్తే మీ ముఖం మీద అలెర్జీ వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ ఇ క్యాప్సూల్స్ ప్రతికూలతలు
విటమిన్ ఇలో నూనె పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలను మూసేస్తుంది. ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. జిడ్డుగల చర్మం ఉన్నవారు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకుండా ఉండాలి.
చర్మంపై ఇన్ఫెక్షన్
మీరు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే, మీ చర్మంపై చికాకు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొందరికి అతిగా వాడితే స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. సున్నితమైన చర్మం ఉన్నవారు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకుండా ఉండాలి. ఇలా చేస్తే ముఖంపై ఎరుపు, దురద, మంట వంటి సమస్యలు రావచ్చు.
Also Read: Dengue Prevention: వర్షాకాలంలో డెంగ్యూ రాకుండా ఉండాలంటే.. మనం ఈ పనులు చేయాల్సిందే..!
చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చుతుంది
విటమిన్ ఇ క్యాప్సూల్ చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చుతుంది. దీని వల్ల ముఖంపై మొటిమలు రావడం మొదలై ముఖం డల్ గా కనిపిస్తుంది. అందువల్ల విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ఉపయోగించే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ సమయంలో చర్మ సంబంధిత సమస్యలు ఉంటే దానిని ఉపయోగించడం మానేయండి. అంతేకాకుండా విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను తక్కువ పరిమాణంలో ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. మొటిమలు, అలెర్జీలు వంటి సమస్యలు రావు.
We’re now on WhatsApp : Click to Join
విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకం
విటమిన్ ఇ క్యాప్సూల్‌ను ఉపయోగించేవారు రాత్రిపూట దానిని అప్లై చేయడం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను అప్లై చేయడం ద్వారా ఆయిల్ రాత్రంతా కరిగిపోయే సమయాన్ని పొందుతుంది. ప్రతిరోజూ విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకుండా ఉండాలి. విటమిన్ ఇని వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే ఉపయోగించవచ్చు. ఇప్పటికే చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకుండా ఉండండి.