Vastu Tips: పొరపాటున కూడా వంటగదిలోని ఈ వస్తువులను అప్పుగా అస్సలు తీసుకోకండి.. అప్పుగా కూడా ఇవ్వకండి!
ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే వంట గదిలోని వస్తువులను పొరపాటున కూడా అప్పుగా తీసుకోకూడదని అలాగే అప్పుగా కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు పండితులు. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:00 AM, Sun - 6 April 25

కొన్ని కొన్ని సార్లు మనం వంట చేసే సమయంలో వంటింట్లోని కొన్ని రకాల వస్తువులు అయిపోయాయి అని వెంటనే ఇంట్లో అప్పుగా తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు దగ్గర్లో ఉండే కిరణా స్టోర్ కి వెళ్తూ ఉంటారు. వంట గదిలోని వస్తువులను అప్పుగా తీసుకునే అలవాటు నేటికీ భారతీయ సంస్కృతిలో కొనసాగుతూనే ఉంది. అవసరం ఉన్నప్పుడు వస్తువులను అప్పుగా తీసుకోవడం వాటిని మళ్ళి తిరిగి ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మన వంట గదిలోని వస్తువులు పూర్తిగా అయిపోయే వరకు ఉండకూడదట.. అలాగే వస్తువులను అప్పుగా ఇవ్వడం, అప్పుగా తీసుకోవడం లాంటివి కూడా చేయకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి వస్తువులను అప్పుగా తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పసుపు.. పసుపును హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వివాహది శుభకార్యాలలో మొదట పసుపును వినియోగిస్తూ ఉంటారు. అదేవిధంగా పసుపును లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంతేకాదు జ్యోతిషశాస్త్రం ప్రకారం పసుపు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. ఈ కారణంగా ఎవరికైనా పసుపు అప్పుగా ఇవ్వడం అశుభం. పొరపాటున కూడ పసుపుని అప్పుగా ఇవ్వకూడదట. అదే సమయంలో పసుపుని అప్పుగా తీసుకోకూడదని చెబుతున్నారు. ఇలా పసుపుని అప్పుగా తీసుకోవడం వల్ల కెరీర్, వైవాహిక, ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చట.
ఉప్పు.. కాగా ఉప్పు లేని ఆహారం రుచిగా లేనట్లు అనిపిస్తుంది. వంటగదిలో అయిపోకూడదని నమ్ముతారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఉప్పు అప్పుగా ఇవ్వకూడదట. దీని వల్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చని చెబుతున్నారు.
పాలు.. కాగా జ్యోతిస్తే శాస్త్ర ప్రకారం పాలు చంద్రునితో ముడిపడి ఉంటాయి. ఈ కారణంగా సూర్యా స్తమయం తర్వాత పాలు లేదా వాటితో తయారు చేసిన ఏదైనా పదార్ధాలను అప్పుగా ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడదట. కాబట్టి పాలు అప్పుగా తీసుకోవడం అప్పుగా ఇవ్వడం లాంటివి అసలు చేయకూడదని చెబుతున్నారు.
ఉల్లి, వెల్లుల్లి.. ఉల్లిపాయ, వెల్లుల్లిని కేతు గ్రహం పాలిస్తుంది. అటువంటి పరిస్థితిలో సూర్యా స్తమయం తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలను అప్పుగా ఇవ్వడం తీసుకోవడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.