Health Tips : రాత్రిళ్లు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుందా..? అయితే మీకు ఈ జబ్బు ఉందేమో..!!
మన శరీరంలోని విషపదార్థాలన్నీ కూడా మూత్రవిసర్జన రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.
- By hashtagu Published Date - 07:00 PM, Sun - 28 August 22

మన శరీరంలోని విషపదార్థాలన్నీ కూడా మూత్రవిసర్జన రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మూత్రంలో నీటితోపాటు పొటాషియం, ఉప్పు, భాస్వరం, యూరిక్ యాసిడ్, వంటి రసాయనాలు ఉంటాయి. కాబట్టి మనకు మూత్రం వచ్చిన వెంటనే వెళ్లాలి. అస్సలు ఆపుకోకూడదు. మూత్రవిసర్జన అనేది మంచిది కానీ పదే పదే మూత్రవిసర్జన చేయడం ఏమాత్రం మంచిది కాదు. కొంతమంది పగటి పూట ఎక్కువగా వెళ్తుంటే…మరికొంతమంది రాత్రిపూట వెళ్తుంటారు. రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం మంచి సంకేతం కాదు…ఎన్నో వ్యాధులకు కారణం కావచ్చు.
రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన:
రాత్రిపూట ఒకటి, రెండుసార్లకంటే ఎక్కువసారి మూత్రవిసర్జనకు వెళ్లడం వల్ల నిద్రకు భంగం వాటిల్లుతుంది. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం. రాత్రిపూట పదేపదే మూత్రవిసర్జన చేయడాన్ని నోక్టురియా అంటారు. ఈసమస్య ఎక్కువగా 50ఏళ్లు ఉన్నవారిలో కంటే తక్కువ వయస్సున్న వారిలో ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే కొన్ని వ్యాధులకు ఇది కారణం కావొచ్చు. మూత్రాశయం, ప్రొస్టేట్ కణితులు, మూత్రపిండాల సంక్రామ్యత, మూత్రాశయం, డయాబెటిస్, కాలువాపు, డిప్రెషన్, అవయవ వైఫల్యం, మూత్రనాళ సంక్రామ్యత వల్ల ఈవిధంగా జరుగుతుంది.
జీవనశైలి:
అధిక రక్తపోటు ఉన్న వారిలో మూత్రవిసర్జన మాత్ర కూడా నోక్టోరియా సమస్యకు కారణం అవుతుంది. ఇదే కాదు జీవన శైలి కూడా కారణం అని చెప్పవచ్చు. కెఫిన్, ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో ఈ సమస్య ఏర్పడుతుంది. ఇవి శరీరంలో మూత్ర ఉత్పత్తికి కారణం అవుతాయి.
పరిష్కారం:
ఇలాంటి సమస్య మీకు ఎదురైతే…వెంటనే వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ సూచించిన మందులను వాడటం మంచిది. వీటితోపాటు జీవనశైలిలోమార్పులు…పడుకునే ముందు నీరు తాగడం మానుకోండి. పడుకునేముందు మూత్ర విసర్జన చేసి పడుకోవడం మంచిది. చిన్న చిన్న వ్యాయామాలు తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే కండరాలు బలోపేతం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.