HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Try Kanuga Oil To Check Psoriasis And Other Benefits

Psoriasis: కానుగ నూనెతో సోరియాసిస్ కు చెక్…అదొక్కటే కాదు ఇంకెన్నో ప్రయోజనాలు..!

కొంతమందికి చర్మవ్యాధులు వల్ల చర్మంపై పొట్టురాలటం, దురద, మచ్చలు పడటం లాంటివి సోరియాసిస్ వచ్చినవారిలోనూ, ఎగ్జిమా వచ్చినవారిలోనూ, కొంతమందికి డర్మటైటిస్ వచ్చినవారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి.

  • Author : hashtagu Date : 02-06-2022 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
psoriasis
psoriasis

కొంతమందికి చర్మవ్యాధులు వల్ల చర్మంపై పొట్టురాలటం, దురద, మచ్చలు పడటం లాంటివి సోరియాసిస్ వచ్చినవారిలోనూ, ఎగ్జిమా వచ్చినవారిలోనూ, కొంతమందికి డర్మటైటిస్ వచ్చినవారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి. మనకు లోపల ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ…అంతగా బాధపడం కానీ…చర్మంపైన ఇలాంటి సమస్యలు వచ్చేసరికి చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందరికీ కనిపించడం ఒక పెద్ద సమస్య. అయితే…దురద పెడుతుంది. ఇలాంటి ప్యాచెస్ ఉంటే..మన పక్కన ఎవరైనా కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. ఆయింట్ మెంట్స్ పూస్తే…తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. కానీ పూర్తిగా తగ్గదు. మరి ఇలాంటి వాటిని తగ్గించుకోవాలంటే నేచురల్ గా కొన్ని పద్దతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కానుగ నూనె…మార్కెట్ లో అమ్ముతారు. ఈనూనె 100ఎంఎల్…100-150 వరకు ఉంటుంది. ఈ నూనెను సోరియాసిస్ తో బాధపడేవారు…స్కిన్ డ్రై అవుతున్నవారు..యూవిరేసెస్ వల్ల స్కిన్ దురదలు వస్తాయి. 3ఎంఎల్ కానుగ నూనె తీసుకుని 5ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకుని…ఈ రెండింటిని కలపాలి. చర్మం మీద ఎక్కడైతే…ప్యాచెస్ వచ్చి ఎర్రగా అయిపొట్టు రాలుతుందో…దురదగా ఉన్న చోట అంతటా ఈ నూనెతో మర్దన చేయాలి. రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ఈ నూనెను రాయాలి. ఈ కానుగనూనెలో ఉండే ఫ్లెవనాయిడ్స్ అనేవి…చర్మంలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా ప్యాచెస్ త్వరగా సాధారణ స్థితికి చేరడానికి బాగా ఉపయోగపడుతుందని…2013లో నార్గండ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.

ఇతర ప్రయోజనాలు.
1 ఈ నూనె ద్వారా ఇతర లాభాలు ఏంటంటే..కొందమంది ఫైల్స్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారుకొద్ది కొబ్బరినూనె, కానుగ నూనె రెండు కలిపి పైల్స్ ఉన్నచోట రాస్తే నొప్పి తగ్గుతుంది.
2. ఇక జాయింట్ పెయిన్స్ తో బాధపడేవారు…నువ్వుల నూనె, కానుగ నూనె రెండు కలిపి గోరువెచ్చగా వేడి చేయాలి. తర్వాత ఆ నూనెను జాయింట్స్ పై రాసి వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంటే ఉపశమనం ఉంటుంది.
3. ఈ నూనెను జుట్టుకు రాస్తే..జుట్టు కలర్ మారకుండా ఉంటుంది. మాడుకు రాస్తే…తెల్లజుట్టు త్వరగా రాదు.
4. కానుగ ఆకులు మలబద్దకాన్ని నివారిస్తుంది.
5. ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నప్పుడు…పండ్లు,మంచి ఆహారం తీసుకుంటే…లోపలి నుంచి తగ్గుతుంది. బాహ్యంగా దురద తగ్గడానికి ఇలాంటి నూనెలు పనికొస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • health
  • kanuga oil
  • psoriasis
  • treatment

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

    • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

    • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

    • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

    • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd