HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Troubled By Joint Pain Then This Might Be Happening In Your Body

Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Author : Vamsi Chowdary Korata Date : 28-06-2026 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Troubled by joint pain? Then this might be happening in your body...!!
Troubled by joint pain? Then this might be happening in your body...!!

ఈ మధ్యకాలంలో చాలామంది ఎన్నో రకాల రోగాలతో సతమతమవుతున్నారు. కారణం మారుతున్న జీవనశైలి. చాలా మందికి రక్తంలో యూరిక్ స్థాయిలు పెరగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మన శరీరంలో ఒక సేంద్రీయ సమ్మేళనం అయిన యూరిక్ ఆమ్లం రక్తప్రవాహంలో తిరుగుతూ మన శరీర జీవక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ స్థాయిలు ఎక్కువైతే.. కిడ్నీల్లో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. యూరిక్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

డ్రైఫ్రూట్స్..

యూరిక్ స్థాయి నియంత్రణలో ఉండాలంటే రెగ్యులర్ డైట్‌లో డ్రైఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాదం పప్పు యూరిక్ స్థాయిని కంట్రోల్‌లో ఉంచేందుకు సహాయపడుతుంది. ప్రతిరోజూ నాలుగు లేదా ఐదు బాదం పప్పులను తినడం మంచిది.

బాదం పప్పు..

బాదం పప్పులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, జింక్, విటమిన్ కే… పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

జీడిపప్పు…

ఇక జీడిపప్పులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి యూరిక్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా సాయపడతాయి. నొప్పులు ఉన్నవారు ప్రతిరోజూ ఐదు జీడిపప్పులను తినడం మంచిది.

వాల్ నట్స్..

వాల్ నట్స్‌ను సూపర్ ఫుడ్ అంటుంటారు. వీటిలో ఒమేగా-3 ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. రోజుకు రెండు వాల్ నట్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. వాల్ నట్స్ కాస్త ధర ఎక్కువైనా, దానికి తగ్గ ఫలితం ఉంటుంది.

అవిసె గింజలు…

ఇవి శరీరంలో యూరిక్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజలలో శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక యూరిక్ స్థాయిల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefits of pumpkin for uric acid
  • health care tips
  • High Uric Acid
  • Reduce Uric Acid

Related News

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd