Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ కరిగించుకోండిలా..!!
నచ్చిన ఆహారం తినడం, మొబైల్ మాయలో పడి అర్థరాత్రి పడుకోవడం, వ్యాయామం చేయకపోవడం, లైఫ్ స్టైల్లో వచ్చే ఈ మార్పులే పొట్ట చుట్టూ కొవ్వును పేరుకుపోయేలా చేస్తాయంటున్నారు నిపుణులు.
- By Hashtag U Published Date - 01:29 PM, Mon - 21 March 22
నచ్చిన ఆహారం తినడం, మొబైల్ మాయలో పడి అర్థరాత్రి పడుకోవడం, వ్యాయామం చేయకపోవడం, లైఫ్ స్టైల్లో వచ్చే ఈ మార్పులే పొట్ట చుట్టూ కొవ్వును పేరుకుపోయేలా చేస్తాయంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనలో చాలా మంది దీన్ని పట్టించుకోరు. కానీ ఇది మన శరీరంలో ఇన్సులిన్ నిరోధించే షుగర్ ముప్పును పెంచుతుంది. గుండె సంబంధిత సమస్యలకూ దారి తీస్తుంది. అందుకే ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలటే…పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును త్వరగా కరిగించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అయితే దీనికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. రోజువారీ అలవాట్లతో బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా కరిగించుకోవచ్చు. మరి ఆ అలవాట్లేంటో చూద్దాం.
1. వేసవికాలం వచ్చిందంటే చాలు శీతలపానీయాలు తాగాలని మనస్సు కొట్టుకుంటుంది. అలాని వీటిని తాగితే ఈ డ్రింక్స్ ఉండే అధిక చక్కెరలు శరీరంలోకి చేరుతాయి. తద్వారా ఇన్సులిన్ స్థాయిల్ని ఒక్కసారి పెంచేస్తాయి. దీంతో శరీరంలో కొవ్వు నిల్వలు కూడా పెరుగుతాయి. కాబట్టి శీతలపానీయాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. మరీ తప్పదనుకుంటే కొద్ది మొత్తంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
2. ఆకలిగా ఉందంటే…స్నాక్స్, బిస్కట్లు తీసుకుంటాం. అవి కాకుండా పీచు ఎక్కువగా ఉండే నట్స్, గింజలు, బార్లీ, పండ్లు, కాయగూరలు , దుంపలు తీసుకోవాలి. ఇలా చేస్తే ప్రాసెస్డ్ ఫుడ్ పై మనసు మళ్లకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మంచిది.
3. వంటల్లో ఇతర నూనెలు కాకుండా కొబ్బరి నూనె వాడటం చాలామంచిది. ఎందుకంటే అది మనశరీరంలో చేరిన కొలెస్ట్రాల్ ను కొవ్వుగా రూపాంతరం చెందించకుండా శక్తిగా మార్చేస్తుంది. దీంతో పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
4. ఇక ఉదయం టీకి బదులుగా ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ లో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు శరీరంలో జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పొట్టు చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా కరిగిపోతుంది.
5. పొట్ట చుట్టున్న కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే…వాల్ నట్స్ చక్కటి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉన్న ఆన్ శ్యాచురేటెడ్ కొవ్వులు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ గుప్పెడు వాల్ నట్స్ స్నాక్స్ సమయంలో తీసుకుంటే మంచిది.
6. డిప్రెషన్, ఆందోళనల వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి…శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తుంది. అందుకే ఇలాంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే వ్యాయాయం, యోగా, ధ్యానం రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి.
7. నిద్రలేమి బరువు పెరగడానికి, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణమని పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే ప్రతిరోజూ 8 గంటలు సుఖంగా నిద్రపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
8. రోజూ ఏరోబిక్స్ చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వుల్ని కరిగించుకోవచ్చు. మోనోపాజ్ దశలోకి ప్రవేశించిన మహిళల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు వారానికి ఐదు గంటలు ఏరొబిక్స్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
9. వీటన్నింటితోపాటు యాపిల్ సిడార్ వెనిగర్ లో ఉండే అసిటిక్ ఆమ్లం బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. రోజూ తీసుకునే ఆహారంలో టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ ను కలిపి తీసుకుంటే మంచిది.
Related News
Panipuri Water : పానీపూరి వాటర్ టేస్టీగా ఉన్నాయని జుర్రేస్తున్నారా ? మీకో షాకింగ్ న్యూస్..
పానీపూరి వాటర్ లో యాసిడ్ కలిపారో లేదో ఎలా తెలుస్తుందనేదే మీ సందేహం అయితే .. ఆ నీరు ముదురు రంగులో కూడా లైట్ రంగులో ఉంటే యాసిడ్ కలిపినట్లేనట. పేపర్ కప్ కాకుండా స్టీల్ బౌల్ లేదా స్టీల్ గ్లాస్ లో వాటర్ పోసి చూస్తే.. దాని అంచుల చుట్టూ మచ్చలు ఏర్పడుతాయి.