HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Thyroid Pain Why Your Body Hurts

‎Thyroid Pain: థైరాయిడ్ వల్ల మెడ, కండరాల నొప్పులు వస్తాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

‎Thyroid Pain: థైరాయిడ్ సమస్య ఉన్నవారికి మెడ, కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయా అంటే అవును అంటున్నారు వైద్యులు. అయితే ఇలా రావడం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 12-11-2025 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thyroid Pain
Thyroid Pain

‎Thyroid Pain: థైరాయిడ్.. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. ఈ సమస్య వచ్చిన వారు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోంటూ ఉంటారు. వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయేవి కూడా ఒకటి. థైరాయిడ్ శరీర జీవక్రియ, హార్మోన్లు, అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుందట. ఈ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, బలహీనత, వాపు వంటి సమస్యలు ప్రారంభమవుతాయట. కాగా థైరాయిడ్ సంబంధిత నొప్పి చాలాసార్లు నెమ్మదిగా పెరుగుతుందట.
‎
‎కొన్ని సందర్భాల్లో గ్రంథిలో వాపు వస్తుందట. దీనివల్ల మెడ లేదా గొంతులో సున్నితత్వం, నొప్పి కలుగుతుందట. ఈ నొప్పి దవడ లేదా చెవి వరకు కూడా వ్యాపించవచ్చని, థైరాయిడిటిస్ వంటి పరిస్థితులు లేదా గొంతులో గొయిటర్ కూడా అసౌకర్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు. థైరాయిడ్ కండరాలు, కీళ్లలో కూడా నొప్పిని కలిగిస్తుందట. హార్మోన్ స్థాయిలు తగ్గినప్పుడు, కండరాలు బలహీనంగా, బిగుతుగా, నొప్పిగా అనిపిస్తాయట. ముఖ్యంగా భుజాలలో ఇబ్బందిగా ఉంటుందని, అదే సమయంలో హైపర్ థైరాయిడిజంలో, చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా అలసట అనిపించవచ్చని చెబుతున్నారు.
‎
‎కొన్నిసార్లు థైరాయిడ్ సమస్య కారణంగా కీళ్లు బిగుసుకుపోతాయట. వాపు కూడా వస్తుందట. హైపోథైరాయిడిజంలో ఈ నొప్పి ఆర్థరైటిస్ వంటి లక్షణాలను కలిగిస్తుందట. దీనిలో కీళ్లలో బిగుసుకుపోవడం, సున్నితత్వం ఉంటుందట. ఈ లక్షణాలు వేరే వాటివల్ల అనుకుంటారు. అందుకే చికిత్స ఆలస్యమై ఇబ్బందులు పెరుగుతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో నొప్పి శరీరంలోని అసాధారణ భాగాలలో కూడా కనిపిస్తుందట. వీపు, భుజాలు లేదా ఛాతీలో నొప్పి వస్తుందని, ఛాతీ నొప్పి అనేది తీవ్రమైన లక్షణం. వైద్యుడిని సంప్రదించడం అవసరం అయినప్పటికీ థైరాయిడ్ ఇతర లక్షణాలు కూడా ఉంటే ఇది గ్రంథితో సంబంధం ఉన్న సంకేతం కావచ్చని చెబుతున్నారు నిపుణులు. థైరాయిడ్ సంబంధిత నొప్పిని తగ్గించడానికి కేవలం మందులే కాకుండా సరైన జీవనశైలి, ఫిజికల్ థెరపీ, నొప్పి నిర్వహణ అవసరమట. సకాలంలో చికిత్స చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా జీవిత నాణ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health problem
  • Thyroid
  • Thyroid pain
  • Thyroid problem

Related News

    Latest News

    • శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్‌ రాజ్‌..!

    • ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవ‌రో తెలుసా?

    • పాకిస్థాన్‌లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!

    • విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!

    • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

    Trending News

      • అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!

      • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

      • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

      • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

      • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd