Weight Loss: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఒక్కసారి ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయాల్సిందే!
Weight Loss: వేగంగా బరువు తగ్గాలి అనుకుంటున్నవారు కొన్ని రకాల సూపర్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏమిటి అన్న విషయానికి వస్తే..
- By Anshu Published Date - 08:00 AM, Fri - 3 October 25

Weight Loss: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం ఇష్టమైన సరే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. అటువంటి వాటిలో బంగాళదుంప కూడా ఒకటి. బంగాళదుంప ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బంగాళదుంపను సరైన పద్దతిలో తీసుకుంటే వేగంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. బంగాళాదుంప బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుందట. దానిని ఉడికించి వేయించిన మసాలా ఏదీ కలపకుండా నేరుగా తింటే అది మీ ఆకలిని నియంత్రిస్తుందట.
అంతేకాకుండా బరువు తగ్గించే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుందని చెబుతున్నారు. బంగాళాదుంపలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. ఇది ఎక్కువ కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందట. కాగా ఉడికించిన బంగాళాదుంపలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ కడుపులో నెమ్మదిగా జీర్ణమవుతుందట. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదని, ఇది అతిగా తినడాన్ని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఫుడ్ క్రేవింగ్స్ తగ్గి బరువు తగ్గడంలో ఇది హెల్ప్ అవుతుందట. ఉడికించిన బంగాళాదుంపల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయట. అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుందట. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట.
మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుందని,జీర్ణక్రియ బాగుంటే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు చూడవచ్చు అని చెబుతున్నారు. 2 ఉడికించిన బంగాళాదుంపలను తొక్క తీసి కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకుని తినాలి. దీనిలో ప్రోటీన్ ఉంటుందట. అలాగే బాయిల్డ్ చేసిన బంగాళదుంప తినడం వల్ల శరీరం వేగంగా కోలుకుంటుందట. టొమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, పెప్పర్, మొక్కజొన్న వంటి వాటితో కలిపి బంగాళాదుంప చాట్ తయారు చేసుకోవచ్చట. ఇది రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు పెరగకుండా ఉండాలంటే బంగాళాదుంపను ఉడికించి మాత్రమే తీసుకోవాలని, ఇంక ఏ రూపంలో దానిని తీసుకున్నా కూడా బరువు పెరుగుతారని, చాలామంది రుచిగా ఉంటుందని బంగాళాదుంపను వేయించి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల రుచి పెరుగుతుంది కానీ దానిలోని పోషక విలువలు తగ్గిపోతాయని, ఇది క్రమంగా బరువు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు.