Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ టీ తాగితే చాలు షుగర్ కంట్రోల్ లో ఉండాల్సిందే!
మధుమేహం ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల టీలు తాగాలని వాటి వల్ల షుగర్ తప్పకుండా అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:04 PM, Wed - 18 December 24

మామూలుగా షుగర్ వ్యాధి గ్రస్తులు కాఫీ,టీలు వంటివి ఎక్కువగా తాగాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. ఇంకొందరు డయాబెటిస్ ఉన్నవారు కాఫీలు టీలకు దూరంగా ఉంటారు. ఇంకొందరు మాత్రం ధైర్యం చేసి రోజుకి ఒకటి లేదా రెండుసార్లు తాగుతూ ఉంటారు. అటువంటి వాటిలో గ్రీన్ టీ కూడా ఒకటి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగాల్సిన టీలలో గ్రీన్ టీ కూడా ఒకటి అని చెబుతున్నారు. ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. 28 గ్రాముల కెఫిన్ ఉన్న ఒక కప్పు గ్రీన్ టీ ని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందట. గ్రీన్ టీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందట.
టైప్ 2 డయాబెటిస్, ఊబకాయాన్ని నివారించడానికి కూడా గ్రీన్ టీ సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ గా పని చేసే టీ లలో బ్లాక్ టీ కూడా ఒకటి. బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ గా పనిచేసే టీ లలో బ్లాక్ టీ ఒకటి. గ్రీన్ టీ మాదిరిగానే బ్లాక్ టీ కూడా ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుందట. అలాగే శరీరంలో తాపజనక ప్రతిస్పందనలను కూడా తగ్గిస్తుందని, బ్లాక్ టీ కార్బోహైడ్రేట్ శోషణను తగ్గిస్తుందని,అందుకే ఇది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. ఎక్కువ పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్, సేంద్రీయ ఆమ్లాలు, ఆంథోసైనిన్లను కలిగి ఉన్న రాగి టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్ తో పాటుగా మందార టీ తాగడం వల్ల రక్తపోటు, లెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట. రక్తంలో ఎక్కువ చక్కెర ఉన్నవారికి పసుపు టీ చాలా చాలా మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది పసుపునకు రంగును ఇస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.