Bread: బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీళ్లకు అస్సలు మంచిది కాదట.. ఎందుకో తెలుసా?
Bread: బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదే కానీ కొంతమందికి అసలు మంచిది కాదని లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి బ్రెడ్ ని ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:30 AM, Fri - 28 November 25
Bread: చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఫుడ్లలో బ్రెడ్ కూడా ఒకటి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, లేదా స్నాక్స్ గా బ్రెడ్ ని తింటుంటారు. అలాగే కాఫీ లేదా వంటి వాటిలో ముంచుకొని తింటూ ఉంటారు. అయితే బ్రెడ్ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదట. మరి ఇంతకీ ఎలాంటి సమస్యలు ఉన్నవారు బ్రెడ్ తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మధ్య కాలంలో చాలామంది బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ జామ్ అంటూ రకరకాల వంటలను తయారు చేసుకుని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తింటున్నారు. గోధుమలతో చేసిన బ్రెడ్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి.
అవి జీర్ణక్రియను సక్రమంగా ఉంచడానికి, శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయట. కానీ వైట్ బ్రెడ్‌లో ఫైబర్ తక్కువగా, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల అది బరువు పెరిగేలా చేస్తుందని, బ్రెడ్ లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లు కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు బ్రెడ్ తినకపోవడమే మంచిదట. సాధారణంగా మార్కెట్లో దొరికే వైట్ బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుందట. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండదని, గోధుమ బ్రెడ్ లేదా మల్టీగ్రేన్ బ్రెడ్ ఆరోగ్యకరంగా అనిపించినా, వాటిలో కూడా ఎక్కువ మైదా లేదా గ్లూటెన్ ఉంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవచ్చని చెబుతున్నారు.
కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే బ్రెడ్ తీసుకోవాలని చెబుతున్నారు. ఊబకాయం లేదా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా బ్రెడ్ ను తినకపోవడం మంచిదట. బ్రెడ్‌లో ఉన్న రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్స్ శరీరంలో త్వరగా చక్కెరగా మారి కొవ్వుగా నిల్వ ఉంటాయి. వైట్ బ్రెడ్ లేదా సాఫ్ట్ బన్‌లలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేస్తుందట. ఫలితంగా మరింత తినాల్సి వస్తుందని, ఆటోమెటిక్ గా బరువు పెరుగుతారని చెబుతున్నారు. గుండె సమస్యలు లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కూడా బ్రెడ్ ను మితంగా తినడం మంచిదట. చాలా బ్రెడ్ లలో ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా హై ఫ్రక్టోజ్ సిరప్ వంటివి ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయట. ప్రత్యేకించి ప్యాక్డ్ బ్రెడ్ లలో ఎక్కువకాలం నిల్వ ఉండటానికి కొన్ని రసాయనాలను కలుపుతుంటారు. ఇవి హార్మోన్‌లపై ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. సెలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు బ్రెడ్ తినడం పూర్తిగా మానుకోవాలట. గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీన్ ఈ వ్యాధితో బాధపడుతున్న వారి శరీరంలో చిన్న ప్రేగులను దెబ్బతీస్తుందట. దీనివల్ల జీర్ణ సమస్యలు, పొట్ట నొప్పి, గ్యాస్, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనపడతాయని, గ్లూటెన్ లేకుండా తయారు చేసిన స్పెషల్ బ్రెడ్ లు మార్కెట్లో దొరుకుతాయి. కానీ అవి కూడా అందరికీ పడకపోవచ్చని చెబుతున్నారు.