Foods Fight Lethargy: శీతాకాలంలో మీ బద్ధకం వదిలి పోవాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ని తినాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ చలి కారణంగా చాలామంది ఉదయం 6,7 అవుతున్నా కూడా నిద్ర లేవడానికి ఏమాత్రం
- By Nakshatra Published Date - 09:30 PM, Mon - 1 January 24
ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ చలి కారణంగా చాలామంది ఉదయం 6,7 అవుతున్నా కూడా నిద్ర లేవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సీజన్లో బద్ధకం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. సూర్యకాంతి తక్కువగా ఉంటుంది, పగలు సమయం కూడా తగ్గిపోతుంది. దీంతో అంతర్గత గడియారానికి అంతరాయం కలుగుతుంది. దీని కారణంగా బద్ధకం పెరిగిపోతుంది. శక్తి స్థాయిలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సూర్యకాంతి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి కూడా తక్కువగానే అందుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గిసేతే అలసట, నిస్సత్తువ, మానసిక స్థితి చికాకుగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి.
కొంతమంది వ్యక్తులైతే.. ఈ కాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అని పిలిచే డిప్రెషన్లోకి వెళ్తారు. దీని వల్ల శక్తిస్తాయిలు తగ్గుతాయి, పని చేయాలనే అసక్తి కూడా ఉండదు. చల్లటి వాతావరణం మనం, ఇంటికే పరిమితం అవ్వడానికి, ఇన్‌యాక్టివ్‌గా ఉండటానికి మొగ్గు చూపుతుంది, సోమరితనం అలవాటు చేస్తుంది. ఈ సీజన్లో మనం యాక్టివ్‌గా ఉడటానికి, బద్ధకాన్ని దూరం చేసుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో తోడ్పడుతుంది. వీటిలోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ సూపర్ ఫుడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి, శరీరంలో ఇన్ఫ్లమేషన్తో పోరాడటానికి సహాయపడతాయి.
సరైన సెల్ పనితీరును నిర్ధరించడానికి తోడ్పడతాయి, అలసటను తగ్గిస్తాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి, అభిజ్ఞా పనితీరును ప్రోత్సహిస్తాయి. బ్లూబెర్రీస్ లోని పోషకాలు శరీర శక్తి స్థాయిలను పెంచుతాయి. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి తోడ్పడుతుంది. ఐరన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది, అలసటతో పోరాడుతుంది. శరీరానికి కావాల్సిన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు క్వినోవాలో ఉంటాయి. వీటితో పాటు ప్రొటీన్ పుష్కలంగా లభించే ఈ ధాన్యంలో మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఇవి ఎముక ఆరోగ్యానికి, జీవక్రియల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పైగా ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి.. శారీరక సత్తువను పెంచుకొని బరువు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో చియా సీడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే బద్ధకం దూరం అవుతుంది. చియా విత్తనాల్లోని ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లు శరీర స్టామినాను పెంచుతాయి. ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను పెంచుతాయి. అంతేకాదు, ఎనర్జీ క్రాష్లను నివారిస్తాయి. ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం చాలా ఎక్కువ. ఈ విత్తనాలు హార్మోన్ల పనితీరును సమతౌల్యం చేసి రక్తపోటును నియంత్రిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి అధికంగా ఉండే సాల్మన్ మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది నిద్రను నియంత్రిస్తుంది.
ఇది శీతాకాలంలోని ఎదురయ్యే బద్ధకంతో పోరాడుతుంది. చిలగడదుంపల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్‌తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. చిలగడదుంపలు శక్తిని స్థిరంగా విడుదల చేస్తుంది. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్, విటమిన్-ఈ, సి, బి-6, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఈ దుంపల్లో మనకి అవసరమైన ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్లరక్తకణాల ఉత్పత్తికి సాయపడతాయి.
Related News
Super Foods: ఈ సూపర్ ఫుడ్స్ తింటే హ్యాపీ హర్మోన్లు.. అవేంటో తెలుసా
Super Foods: ఆహారం మన కడుపు నింపి, శక్తిని ఇవ్వడమే కాకుండా, మన ఒత్తిడిని తగ్గించి, మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచే మరియు మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని నమ్ముతారు. అవేంటో తెలుసుకోండి స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటా�