Belly Fat: బెల్లీ ఫ్యాట్ కరిగిపోవాలంటే భోజనానికి ముందు వీటిని తీసుకోవాల్సిందే?
భోజనానికి ముందు కొన్నింటిని తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 11:40 AM, Mon - 5 August 24

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి విపరీతంగా బరువు పెరిగి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు హోమ్ రెమెడీస్ ఫాలో అయితే మరి కొందరు ఎక్సర్సైజులు వ్యాయామలు జిమ్ కు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఫిట్ గా ఉండేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
భోజనానికి ముందు కొన్నింటిని తీసుకుంటే ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని చెబుతున్నారు. మరి భోజనానికి ముందు ఎలాంటివి తీసుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గితే బరువు తగ్గుతారు. ఇందుకోసం సరైన ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఆకలి కంట్రోల్ అవుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారు. జీవక్రియ పెరిగితే బరువుని బ్యాలెన్ష్ చేయవచ్చు. సరైన ఫుడ్, డ్రింక్స్ జీవక్రియని గణనీయంగా పెంచుతుంది. కానీ, భోజనానికి ముందు కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోంటే జీవక్రియ పెరుగుతుందట. భోజనానికి ముందు అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి హెల్దీ ఫ్యాట్స్ ని తీసుకుంటే కొద్దిగా తినగానే కడుపునిండిన ఫీలింగ్ వచ్చి ఎక్కువగా తినరు.
కొవ్వు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందట. కడుపు నిండుగా ఉంటుందట. దీంతో తక్కువగా తినడంతో బరువు కూడా తగ్గుతారట. భోజనానికి వెజిటేబుల్ సూప్ తాగడం చాలా మంచిది. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. సూప్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ వంటి సమ్మేళనాలు థర్మోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీంతో కేలరీలు బర్న్ అవుతాయి. గ్రీన్ టీని భోజనానికి ముందు తీసుకుంటే జీవక్రియ పెరుగుతుందట. తక్కువ కేలరీల గ్రీన్ టీ శరీరాన్ని హైడ్రేట్ చేసి రిఫ్రెష్ చేస్తుందట. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు, టోఫు, బీన్స్ తీసుకుంటే జీవక్రియ పెరుగుతుందట. కార్బోహైడ్రేట్స్, కొవ్వులతో పోలిస్తే ప్రోటీన్ జీర్ణమవ్వడానికి ఎక్కువ టైమ్ పడుతుందని చెబుతున్నారు.
note: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే.