Pregnancy Tips: ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా.. అయితే ఈ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాల్సిందే!
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వారు డైట్ లో తప్పకుండా కొన్ని ఫుడ్స్ ని చేర్చుకోవాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Thu - 9 October 25

Pregnancy Tips: స్త్రీ లకు తల్లీ అవ్వడం అన్నది దేవుడి ఇచ్చిన గొప్ప వరం. అయితే తల్లి కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ అవకాశం కేవలం కొద్ది మందికి మాత్రమే వస్తుంటుంది. చాలామంది పిలల్లు కలగక హాస్పిటల్స్ చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇకపోతే తల్లి కావాలి అనుకుంటున్న వారు అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ముందు నుంచే ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా వారి ప్రెగ్నెన్సీ ట్రయల్స్ లో భాగంగా ప్రోటీన్ ను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
మొక్కల ఆధారిత ప్రోటీన్ అయితే ప్రెగ్నెన్సీ అవకాశాలను మెరుగుపరుస్తుందట. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలా మంది తమ డైలీ రొటీన్ లో ఇడ్లీ, దోశలు ఎక్కువగా తింటూ ఉంటారు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే కచ్చితంగా మీరు వాటికి బదులుగా ఓట్స్ తీసుకోవాలని చెబుతున్నారు. వీటిలో 8 నుంచి 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. దీనిలో కార్బోహైడ్రేట్లు కడుపు నిండుగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయని, ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందని, కాబట్టి గట్ హెల్త్ కి మంచిదని చెబుతున్నారు. అలాగే చిక్కుళ్లు, పప్పులు ప్రోటీన్ కు మంచి సోర్స్, కాబట్టి వీటిని రోజులో కనీసం ఒక పూట అయినా ఉండేలా ప్లాన్ చేసుకోవాలట.
ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవట. కనీసం రోజుకు 100 గ్రాముల ప్రోటీన్ లేదా చిక్కుళ్లు తీసుకుంటే శరీరానికి 12 నుంచి 15 గ్రాముల ప్రోటీన్ అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ గుప్పెడు నట్స్, సీడ్స్ కలిపి తీసుకుంటే కూడా శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుందట. పిల్లల కోసం ట్రై చేసేవారు కచ్చితంగా తినాల్సిన హెల్తీ ఫుడ్ ఇది అని చెబుతున్నారు. 100 గ్రాముల బాదం పప్పులో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. అయితే రోజూ అంత తినలేము కాబట్టి వాటిని మీరు వివిధ నట్స్, సీడ్స్ తో మిక్స్ చేసుకుని తినవచ్చట. దీనివల్ల శరీరానికి మంచి పోషణ అందుతుందని చెబుతున్నారు. వెజిటేరియన్స్ కి సోయా, టోపు, మిల్మేకర్ వంటివి ప్రోటీన్‌కి చాలా బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పాలి. వీటిని నాన్ వెజ్టేరియన్స్ కూడా తీసుకోవచ్చట. రోజులో ఏదో పూట వీటిని తీసుకోవడం వల్ల 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ అందుతుందని చెబుతున్నారు. మీరు ప్రోటీన్ కోసం రైస్‌కి బదులుగా క్వినోవా తీసుకోవచ్చట. దీనివల్ల అదనపు ప్రోటీన్ శరీరానికి అందుతుందని, ప్రోటీన్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఇది మరెన్నో ప్రయోజనాలు అందిస్తుందని, నెమ్మదిగా జీర్ణమవుతుందని శరీరంలో చక్కెరలను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు.